ఖతర్నాక్ గాళ్ల చేతికి చిక్కిన ముమైత్ ఖాన్
గత కొన్ని రోజులుగా తెలుగు తెరపై కనిపించకుండా పోయిన సెక్సీ ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ పేరు తాజాగా ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశమైంది. ఈ హాట్ లేడీ ఖతర్నాక్ గాళ్ల చేతికి చిక్కింది. ఆమెను అందాలను బాగా వేడేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు వారంతా. ఎవరీ ఖతర్నాక్ గాళ్లు అనుకుంటున్నారా? హిందీలో విజయవంతమైన 'రఫ్తా రఫ్తా" చిత్రాన్ని ఎస్.కె. ఫిలిమ్స్ పతాకంపై 'ఖతర్నాక్ గాళ్లు" అనే పేరుతో నిర్మాత సయ్యద్ తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమాలో ఐటం బాంబుగా నటిస్తోంది ముమైత్.
ఇటీవలే డబ్బింగ్ కార్యక్షికమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ....యువతను విశేషంగా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో కొంత యాక్షన్ పార్ట్ కూడా వుంది. లండన్ నేపథ్యంలో కథ సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన వెంకట్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ముమైత్‌ఖాన్‌పై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బాలీవుడ్‌లో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయిలో విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
హీరోయిన్లంతా ఐటం సాంగులు చేయడానికి ఎగబడుతుండటంతో పాపం ముమైత్ ఖాన్ కు అవకాశాలే లేకుండా పోయాయి. ఎట్టకేలకు ఈ ఖతర్నాక్ గాళ్లు చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో హద్దులు మీరి అందాలు ప్రదర్శించి మళ్లీ తన ప్రాభవాన్ని తిరిగి పొందడానికి, వరుస సినిమాలతో బిజీ అయిపోవడానికి ట్రైచేస్తోంది ముమైత్. మరి ఆమె ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











