ముమైత్ ఖాన్ 'యల్ బోర్డ్' పెట్టుకునేది ఎప్పుడంటే...
ముమైత్ ఖాన్ ప్రధానపాత్రలో తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణమవుతున్న 'యల్ బోర్డ్' చిత్రం తొలి కాపీ సిద్ధమైంది. యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తయారైన ఈ చిత్రాన్ని మే మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో హిందీలో చేసిన 'లవ్ డాట్ కామ్' చిత్రం త్వరలో తెలుగులో 'యల్-బోర్డ్' పేరుతో డబ్బింగ్ అవుతోంది. ఈ చిత్రం కథ ఒక క్యాబరే డాన్సర్‌కీ, మాఫియా గ్యాంగ్‌లో పనిచేసే ఓ యువకుడికీ మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది చిత్ర కథాంశం గా రూపొందింది. ఇక ఈ చిత్రంలో క్యాబరే డాన్సర్‌గా ముమైత్ చేసింది. మాఫియా గ్యాంగ్ నుంచి తన ప్రియుణ్ణి బయటకు తీసుకురావడానికి ఆ గ్యాంగ్ లీడర్‌తో ఆమెకి ఎదురయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయని నిర్మాతలు చేప్తున్నారు.
సినిమా గురించి యువరాజ్ జె మీడియాతో మాట్లాడుతూ.."క్యాబరే డాన్సర్‌గా మొదలై చిత్ర విచిత్రంగా సాగే ప్రధాన పాత్రలో ముమైత్ ఖాన్ చాలా చక్కగా నటించింది. ఒక మాఫియా గ్యాంగ్ నుంచి తన ప్రియుణ్ణి రక్షించుకోడానికి ముమైత్ చేసే సాహసాలు ఎంతో ఎమోషనల్ గా ఉంటాయి. ఇక ఆమె కనిపించే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి, గిలిగింతలు పెడతాయి. బప్పీలహరి సంగీతం సమకూర్చిన నాలుగు పాటల్ని కన్నులకింపుగా చిత్రీకరించారు" అని చెప్పారు. నైనా దలైవాల్, జై కల్ రా, మైక్ సింగ్ ప్రధాన తారాగణమైన ఈ చిత్రానికి మాటలు, పాటలు: భారతీబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వినోద్ ఎం.


Click it and Unblock the Notifications











