అన్నిటికి అతీతంగా ముమైత్

By Staff

Mumaith Khan
'ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే ' అంటూ 'పోకిరి' లో అదరకొట్టిన ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ముమైత్ ప్రధాన పాత్రలో మరో సినిమా ప్రారంభమైంది. ' బ్రహ్మ' తో పరిచయమైన చెరుకూరి సాంబశివరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇండియన్ ఫిలిమ్స్ బానర్‌పై పి.శ్రీనివాస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఎవడైతే నాకేంటి' లో సైడు హీరోయిన్ గా చేసిన ఈమె 'ఆపరేషన్ దుర్యోధన' తో హీరోయిన్ గా ప్రమోషన్ కొట్టి ఎదిగింది. తర్వాత చేసిన 'భూకైలాస్' ,'మైసమ్మ', 'మంగతాయారు టిఫిన్ సెంటర్' సినిమాలు వర్కవుట్ కాలేదు. అయినా ఆమె కెరీర్ లో లో పెద్ద మార్పేమిలేదు. ఆమెతో సినిమాలు తీద్దామనే వాళ్ళూ తగ్గలేదు. ప్రస్తుతం టార్గెట్, పున్నమి నాగు చిత్రాలలో హీరోయిన్ గా చేస్తున్న ఈమె ఈ కొత్త సినిమాలో ఒక సాదా, సీదా అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది.

ఫ్లాపు వస్తే కెరీర్ పరిసమాప్తి అనుకునే ఈ రోజుల్లో ముమైత్ వరస చిత్రాలతో దూసుకుపోవటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇక ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవ మీడియా సమావేశంలో సామాజిక, రాజకీయ, ఆర్ధిక కథాంశంతొ ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెరుకూరి సాంబశివరావు చెప్పాడు. ముమైత్ సినిమాకు ఎవరైనా కథ కోసం వెళతారా అని అది విన్నవాళ్ళు అనుకున్నారు. దాంతోనే ఆమె జయాపజయాలకే కాక కథ కాకరకాయలకు కూడా అతీతురాలైపోయిందన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X