ముమైత్ ఖాన్ చుట్టూ తిరిగే రియల్ స్టోరీ
మే మూడో వారంలో ప్రారంభం కానున్న ఈచిత్రం గురించి నిర్మాత కె.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ..'మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనకు ఇన్ స్పైర్ అయి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. కథ మొత్తం ముమైత్ ఖాన్ చుట్టూ తిరుగుతుంది. మే మూడో వారంలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాము.
ప్రస్తుతం ప్రవీణ్ ఇమిడి సంగీత దర్శకత్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ యువ జంట హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఆ హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. సబ్జెక్టు డిమాండ్ మేరకు బడ్జెట్ కి వెనకాడకుండా ఈచిత్రాన్ని భారీగా నిర్మించడానికి ప్లాన్ చేశాం. బ్యాంకాక్, హైదరాబాద్, ముంబైలలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది' అన్నారు.
ముమైత్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, ఎం.ఎస్. నారాయణ, కృష్ణ భగవాన్, భరత్, పృథ్వీ, మాస్టర్ భువన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, ఎడిటింగ్ నందమూరి హరి, ఫైట్స్: నందు, నిర్మాత: కె.ఎస్. ప్రసాద్, కథ స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డి.వి.కె. నాగేశ్వరావు.


Click it and Unblock the Notifications












