‘కండోమ్’ గురించి ట్వీటిన ముమైత్ ఖాన్
టాలీవుడ్ సెక్సీ ఐటం బాంబ్ ముమైత్ ఖాన్ గుర్తుందా?....ఎందుకిలా అడుగుతున్నామంటే ఈ భామ గత కొన్ని రోజులుగా తెలుగు తెరపై కనిపించడం లేదు. పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు ప్రేక్షకులను ఓ ఊపుఊపిన ముమైత్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలే కరువయ్యాయి. శ్రీయ, ఛార్మి, పార్వతి మెల్టన్ లాంటి హీరోయిన్లు సైతం ఐటం సాంగులు చేస్తుండటంతో పాపం ఈ హాట్ లేడీకి అవకాశాలే లేకుండా పోయాయి.
అయినా..సరే తన ఉనికిని కాపాడుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వార్తల్లో నిలిచేందుకు ట్రై చేస్తుంది ముబైత్. అందకే కాబోలు 'కండోమ్" గురించి తన ట్విట్టర్ లో ట్వీటింది. కండోమ్ అనే పదం డాక్టర్ చార్లెస్ కండోమ్ అనే పేరు నుండి పుట్టింది అంటూ చెప్పకొచ్చింది. మరి ముమైత్ కి ఉన్నట్టుండి కండోమ్ గురించి ఎందుకు మాట్లాడాలని అనిపించిందో తెలియదుగానీ. ముమైత్ ప్రకటన చూసిన వారంతా....బహుషా ఆమె ఏదైనా కండమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరించడమో లేదా కండమ్ ప్రకటనల్లో నటించేందుకు ఆసక్తి చూపుతుంది కాబోలు అని చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











