కొత్తవారికి అవకాశం ఇవ్వటం కోసమే...ముమైత్ ఖాన్
ముంబాయి నుంచి వచ్చినప్పుడు తనకు తెలుగు పరిశ్రమ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించినట్లుగానే, తాను కూడా కొత్తవారికి అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో సుగర్ క్యాండీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రారంభించానని ముమైత్ ఖాన్ అన్నారు.సుగర్ క్యాండీ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ముమైత్ ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్ని ఆమె బుధవారం హైదరాబాద్‌లో మీడియాకు వెల్లడించారు.ఆమె మాటల్లో...నా మాటలు తియ్యగా ఉంటాయి. నేను స్వీట్ గాళ్‌ని. అందుకే నా సంస్థకు సుగర్ క్యాండీ ఎంటర్‌టైన్‌మెంట్ అని పేరు పెట్టా. అలాగే...తొలి ప్రయత్నంగా మా బేనర్ ద్వారా ఈవెంట్స్ చేయబోతున్నాం. అనంతరం లఘు చిత్రాలు, సినిమాలు, బుల్లితెర కోసం రియాల్టీ షోలు చేయాలన్నది తన సంకల్పమన్నారు. ముఖ్యంగా చలన చిత్రోత్సవాలకు పంపించే అర్హత కలిగిన డాక్యుమెంటరీలు చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఈ బేనర్ ద్వారా వచ్చే ఆర్థిక లాభాలను సేవా కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నాను అని వివరించారు. నటనకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లేనా? అంటే..ఆ ఆలోచనే లేదు. ప్రస్తుతం నేను నా రాక్షసి లో నటిస్తున్నాను అని ముమైత్ చెప్పారు.


Click it and Unblock the Notifications











