ముమైత్ ఖాన్ ‘ఘరానా’
ముమైత్ ఖాన్ తన కెరీర్ ను ఐటమ్ సాంగ్ తో మొదలు పెట్టి, పోకిరి సినిమాతో భాగా తెలుగు ప్రేక్షకులకు, అటు కుర్రకారుకు, పిల్లలకు, వృద్దులకు, నోటెండ్ అయింది. తన అందచందాలతో అంగాంగ ప్రదర్శన చేస్తూ సినిమా థియేటర్స్ లో ఈలలు, కేకలతో ఐటమ్స్ సాంగ్స్ లో ఒక్కో సినిమాలో ఒక్కో కొత్తదనంతో దర్శనమిచ్చే ఈ ఐటమ్ గర్ల్ బాగా పాపులర్ అయ్యింది. ఈ మద్య ముమైత్ 'పున్నమినాగు" సినిమాలో చేసిన అంగాంగ ప్రదర్శన ఎలా ఉన్నా'మగధీర" చిత్రంలో రామ్ చరణ్ తేజ, తాను చేసిన బంగారు కోడిపెట్ట సాంగ్ తనకి భాగా నచ్చిందని ఆ పాట తనకెంతో సంతృప్తినిచ్చిందని తన కెరీర్ లో ఒక స్పెషల్ ఐటం సాంగ్ అదేనని చెప్పింది. ఈ సాంగ్ తో తనకొస్తున్న కామెంట్స్ ను ప్రక్కన పెడుతూ 'ఘరానా మొగుడు" సినిమాలో 'చిరంజీవి" సరసన 'డిస్కోశాంతి" ఒరిజినల్ పాటకు చాలా భాగా డాన్స్ చేసిందని అంతకంటే ఎక్కువగానే ఈ సాంగ్ లో నేను కష్టపడి స్టెప్స్ వేశాని చెప్పింది. అందువలనే తనకు ఫ్యాన్స్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్, కాంప్లిమెంట్స్ వస్తున్నాయని ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయని, అందులోను ఫీమేల్ ఒరియెంటెడ్ ఫిల్మ్ కూడా వుండటంతో తనకు తగ్గ పాత్రను ఎంచుకొనట కొచ్చేం కష్టం అనిపించినా ప్రయత్నిస్తున్నాని చెబుతోంది.


Click it and Unblock the Notifications











