హ్యాట్రిక్ కోసం ముమైత్-ప్రభాస్
సిల్క్ స్మిత తరువాత ఐటమ్ సాంగ్ లకు కొత్తదనం తెచ్చిన ఐటమ్ గాళ్ ముమైత్ ఖాన్. ప్రభాస్ సినిమాలలోనూ ముమైత్ ఐటమ్ సాంగ్ లు చేసింది. తాజాగా ప్రభాస్ తో మరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ముమైత్ సిద్ధమవుతోంది. తొలుత ముమైత్ చత్రపతి సినిమాలో యెన్నెల తిన్నవురా కృష్ణా పాటకు నర్తించింది. రెండో సినిమా యోగి. ఓరోరి యోగి నను కొరికెయిరో అంటూ ప్రభాస్ ను ఇబ్బంది పెట్టింది. ఇపుడు మూడో సినిమా చేయబోతోంది. పూరి జగన్నాథ్ తాజాగా రూపొందిస్తున్న బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నయ్ సినిమాలో ముమైత్ ఐటమ్ సాంగ్ చేయబోతోంది. తన ఫేవరైట్ హీరో ప్రభాస్ అనిచెప్పిన ముమైత్ ఖాన్ ఆయనతో హ్యాట్రిక్ ఐటమ్ సాంగ్ చేయబోతోంది.


Click it and Unblock the Notifications











