ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ ఒకప్పటి యాక్షన్ సినిమాల డైరక్టర్ కోదండరామిరెడ్డి సినిమాలో హీరోయిన్ గా బుక్కయింది.దీనికి యండమూరి వీరేధ్రనాథ్ చాలా కాలం తర్వాత కథ అందిస్తున్నారు.సినిమాల్లో మసాలాగా మామూలుగా ఉన్న ముమైత్ ఖాన్ 'పోకిరి' సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తర్వాత హఠాత్తుగా హీరోయిన్ అయి డిమాండ్ లో స్ట్రయిట్ హీరోయిన్ లకు పోటీ ఇస్తోంది.మైసమ్మ,మంగతాయారు టిఫిన్ సెంటర్,నిర్మాణంలో ఉన్న టార్గెట్ లతో తానేమిటో ప్రూవ్ చేసుకుంటోది.ఇప్పడు ఈ సినిమా ఆఫర్ రావటంతో ఆమె సంతోషానికి అవధులు లేవు.ఎందుకంటే చిరంజీవి,బాలకృష్ణ వంటి హీరోలకు పెద్ద హిట్టులు ఇచ్చిన ఘనత కోదండరామిరెడ్డిది.ఈ సినిమా పేరు పున్నమి నాగు అని నిర్ణయించారు.అదీ ఒకప్పటి చిరంజీవి సినిమాది కావటం గమనార్హం.దీంట్లో రాజీవ్ కనకాల హీరోగా చేస్తున్నాడు.ఉగాదిన ప్రారంభమయ్యే ఈ సినిమా సోషియో ఫాంటసీ..ట.యండమూరి తాజా హిట్ నవల తప్పు చేద్దాం రండి ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తూండవచ్చు అని అంటున్నారు.