వీణా మాలిక్... మణిశర్మ కు రిలీఫ్ ఇస్తుందా?

By Srikanya

హైదరాబాద్ : వీణా మాలిక్‌, కరణ్‌ వీర్‌ బోరా, వేదిత ప్రతాప్‌ సింగ్‌, అపర్ణ బాజ్‌పాయ్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం 'ముంబై 125 కిమీ'. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలం అయ్యినా ఆర్దిక సమస్యలతో విడుదలకు నోచుకోలేదు.

ఈ మధ్య మణిశర్మ ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ చాలా బాధపడ్డారు కూడా. ఇప్పుడీ చిత్రం విడుదలై ఆయనకు రిలీఫ్ ఇస్తుందా లేదా అన్నది అందరికీ ఆసక్తి కలిగించే అంశం. వీణామాలిక్ ఉంది కాబట్టి ఓపినింగ్స్ వచ్చే అవకాసం ఉందని, అయితే చిత్రం ఏ మేరకు విషయం ఉందనే విషయమై సినిమా విజయం ఆధారపడుతుందని ట్రేడ్ లో అంటున్నారు.

Mumbai 125 KM 3D movie ready to release

సినిమాలు తీసి బాగుపడ్డవాడు ఎవడూ లేడని తెలిసి కూడా నేను ఆ తప్పు చేశాను. చాలా నష్టం అనుభవిస్తున్నాను. 'ముంబై 125 కి.మీ' త్రీడీ హారర్‌ సినిమా హిందీలో నిర్మించాను. చేతులు కాలాయి. పట్టుకోవడానికి ఆకులు కూడా లేవు అన్నారు అంటూ బాధపడ్డారు మణిశర్మ.

''ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే చిత్రమిది. ముంబైకు 125 కిమీల దూరంలో ఏం జరిగిందో తెరపై చూడాల్సిందే'' అంటున్నారు దర్శకుడు. ''రియల్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కించాం. వచ్చే నెలలో పాటలను విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్‌ షాయ్‌, కూర్పు: సందీప్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X