»   » సల్మాన్‌‌పై ఆ కేసు మళ్లీ మొదటి నుంచి విచారణ

సల్మాన్‌‌పై ఆ కేసు మళ్లీ మొదటి నుంచి విచారణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ పదకొండేళ్ల క్రితం కారుతో నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లి, ఒకరి మృతికి కారణమైన (హిట్‌ అండ్‌ రన్‌)కేసును మళ్లీ ఫ్రెష్‌గా విచారణ జరుపాలంటూ ముంబై కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును విచారణ మళ్లీ మొదటి నుంచి కొత్తగా మొదలు పెట్టనున్నారు.

ఈ కేసుకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్‌ను మళ్లీ పరిశీలించాలని, సాక్షులను మరోసారి విచారించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఈ కేసులో మళ్లీ తాజాగా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసు క్లోజ్ కావడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో? అనే సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

2002లో జరిగిన ఈ కేసుపై సల్మాన్‌ గతంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా ముంబై సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. హత్య కాకుండా ప్రాణ నష్టం కల్గించాడనే అభియోగాలను సల్మాన్‌పై మోపేందుకు ప్రయత్నించారు. 2002 సెప్టెంబర్‌ 28న తెల్లవారు జామున బాంద్రాలో బేకరి బయట నిద్రిస్తున్న వారిపైకి సల్మాన్‌ కారు డ్రైవర్‌ దూసుకెళ్లగా, ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.

English summary
A Mumbai court has ordered fresh trial in a 2002 hit-and-run case against actor Salman Khan. The actor, who is being tried for culpable homicide not amounting to murder, had asked for a fresh trial.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu