రేప్ చేసింది ఇతడే: గగ్గోలు పెట్టిన హీరోయిన్ (ఫోటో)
ముంబై: హీరోయిన్‌పై అత్యాచారం చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. గత డిసెంబర్ 9న ఈ సంటన చోటు చేసుకుంది. ఆమె స్వయంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంగ్లపత్రిక మిడ్ డే వెలువరించిన కథనం ప్రకారం... ఫిర్యాదులో బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం....ముఫదల్ గడియాలి అనే 32 ఏళ్ల వ్యక్తి తనపై అత్యాచారం చేసాడని సదరు నటి పేర్కొంది. డిసెంబర్ 7న అతన్ని కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసానని, ‘72 హవర్స్' అనే హిందీ చిత్రంలో అవకాశం ఇస్తానని నమ్మబలికాడని, రూ. 7.5 లక్షలకు రెమ్యూనరేషణ్ కూడా ఖరారైందని తెలిపారు.
ఫోటో: దీపక్ ఠాకూర్ ఫోటో: ముఫదల్ గడియాలి

కాంట్రాక్టు మీద సైన్ చేసేందుకు తనను ఇంటికి రమ్మన్నారని, రూ. 3 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత చిన్న పార్టీకి తీసుకెళ్లారని, అనంతరం గడియాలి తన మేనేజర్ దీపక్ ఠాకూర్‌కు ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేయమని చెప్పారని తెలిపారు. డ్రింక్స్ లో ఏదో కలిపి అనంతరం తనపై అత్యాచారం చేసారని బాధితురాలు ఆరోపిస్తోంది.
సినిమా రంగంలో ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటుండం ఆందోలనకు గురి చేస్తోంది. కొత్తగా పరిశ్రమకు వచ్చే అమ్మాయిలను కొందరు మెసం చేస్తున్నారనడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం. అయితే చాలా మంది ఇలాంటి విషయాలు బయట పెట్టకుండా దాస్తున్నారు. కొందరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications