»   » షాక్: కోట్లు విలువ చేసే ఆస్తి ఆ హీరో పేరుపై రాసి చనిపోయిన అభిమాని!

షాక్: కోట్లు విలువ చేసే ఆస్తి ఆ హీరో పేరుపై రాసి చనిపోయిన అభిమాని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా స్టార్ల పట్ల కొందరు తమ అభిమానం వింతగా చాటుకుంటారు. కొన్ని సార్లు వారు చేసే చర్యలు అటు స్టార్లతో పాటు ఇటు సామాన్య జనాలను ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ అభిమాని ఏకంగా తనకు ఇష్టమైన సినిమా యాక్టర్‌కు కోట్ల విలువ చేసే తన ఆస్తిమొత్తం రాసి ఇచ్చి చనిపోయారు. ఈ విషయం తెలిసి అటు ఆ అభిమాని కుటుంబ సభ్యులు, ఇటు ఈ హీరోగారు షాకయ్యారు.

 సంజయ్ దత్ పట్ల పిచ్చి అభిమానం

సంజయ్ దత్ పట్ల పిచ్చి అభిమానం

సంజయ్ దత్ అంటే పిచ్చి పిచ్చిగా అభిమానించే ముంబయికి చెందిన నిషి హరిశ్చంద్ర త్రిపాఠి అనే మహిళకు తన అభిమాన నటుడికి తన ఆస్తి మొత్తం వీలునామా రాసి చనిపోయారు.

 చనిపోవడానికి కొన్ని నెలల ముందే

చనిపోవడానికి కొన్ని నెలల ముందే

ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో నివాసం ఉండే నిషి హరిశ్చంద్ర త్రిపాఠి జనవరి 15న అనారోగ్యంతో మరణించారు. చనిపోవడానికి కొన్ని నెలల ముందే ఆమె తన ఆస్తి మొత్తం సంజయ్‌ దత్‌ పేరిట రాశారు. మరణం అనంతరం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఆమె పేరు మీద ఉన్న ఆస్తును సెటిల్ చేసేందుకు వివరాలు పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది.

అప్పటి వరకు ఎవరికీ తెలియదు

అప్పటి వరకు ఎవరికీ తెలియదు

ఆమె ఆస్తులకు సంబంధించిన పత్రాలు, వీలునామా పరిశీలించే వరకు.... ఆస్తి సంజయ్ దత్ పేరిట రాసిన విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. నిబంధనలు ఫాలో అవ్వాలి కాబట్టి బ్యాంకు అధికారులు పోలీసుల ద్వారా సంజయ్ దత్‌ను సంప్రదించారు.

 ఫోన్ రాగానే షాకైన సంజయ్

ఫోన్ రాగానే షాకైన సంజయ్

నిషి త్రిపాఠి అకౌంట్ వ్యవహారాలు చూస్తున్న బ్యాంకు అధికారులు.... జనవరి 29న అతడిని ఫోన్ ద్వారా సంప్రదించారు. నిషి త్రిపాఠి అనే మీ అభిమాని చనిపోయే ముందు ఆస్తిని మీ పేరిట బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారు అని చెప్పడంతో.... సంజయ్‌ దత్‌ సైతం షాకయ్యారు.

నా ఆ డబ్బు వద్దు అంటున్న సంజయ్ దత్

నా ఆ డబ్బు వద్దు అంటున్న సంజయ్ దత్

నిషి త్రిపాఠి తన పేరు మీద రాసిన ఆస్తులను స్వీకరించడానికి సంజయ్ దత్ నిరాకరించారు. ఈ విషయంలో తనకు లీగల్‌గాఎలాంటి ఇబ్బందులు రాకుండా తన లాయర్ చేత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు లేఖ రాయించారు. నిషి తన పేరిట డిపాజిట్‌ చేసిన ఆస్తికి, తనకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు.

 రూ. 10 కోట్ల పైనే ఆస్తులు

రూ. 10 కోట్ల పైనే ఆస్తులు

చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుండే నిషి హరిశ్చంద్ర త్రిపాఠి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె తన 80 సంవత్సరాల వయసున్న తల్లి శాంతి, తోబుట్టువులు అరుణ్, ఆశిష్, మధులతో కలిసి మలబార్ హిల్స్ లోని త్రివేణి అపార్ట్‌మెంట్స్ 2500 స్కేర్ ఫీట్స్ విస్తీర్ణంగల 3 బెడ్రూంల ఫ్లాట్లో ఉండేవారు. ఈ ఫాట్ విలువ రూ. 10 కోట్లుపైనే. ఈ ఫ్లాట్ నిషి పేరుమీదే ఉంది. ఈ ఇంటి పత్రాలతో పాటు తన విలువైన వస్తువలన్నీ ఆమె బ్యాంకు లాకర్లో పెట్టి...... అవి సంజయ్ దత్‌కు చెందేలా విల్లు రాశారు.

ఆ ఆస్తులు వారి కుటుంబీకులకే చెందేలా చేస్తాను

ఆ ఆస్తులు వారి కుటుంబీకులకే చెందేలా చేస్తాను

సంజయ్‌ దత్ ఈవిషయమై మీడియాతో స్పందిస్తూ..‘మాపై అభిమానంతో కొందరు అభిమానులు తమ పిల్లలకు మా పేర్లు పెడుతుంటారు. కానీ పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తులు నా పేరుపై రాశారని తెలిసి షాక్‌ అయ్యాను. నిషి త్రిపాఠి ఎవరో నాకు తెలీదు. న్యాయం ఆమె ఆస్తులు వారి కుటుంబ సభ్యులకే చెందాలి. ఈ వ్యవహారంలో తనవంతు సహాయం చేస్తాను అని సంజయ్ దత్ వెల్లడించారు.

English summary
Nishi Harishchandra Tripathi, a Malabar Hill resident who passed away on 15 January, has bequeathed all her wealth to Sanjay Dutt, states a Mumbai Mirror report.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu