ఆలియాభట్ ప్రైవేట్ లైఫ్ ఫోటోలు లీక్.. రంగంలోకి ముంబై పోలీసులు.. అనుష్కకు ఇలాంటి చేదు అనుభవం
బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రైవేట్ జీవితాన్ని దొంగచాటుగా షూట్ చేసిన ఫోటోగ్రాఫర్ల వ్యవహారాన్ని ముంబై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తన ఇంటిపై టెర్రస్‌పై ఉండగా తన స్వేచ్ఛను హరించేందుకు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించారు. తనను దొంగచాటుగా ఫోటోలు తీశారు అని ఆలియాభట్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడం వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులు స్వయంగా జోక్యం చేసుకొంటూ.. ఆలియాభట్‌ను కేసు నమోదు చేయాలని సూచించడం ఈ ఘటనలో ఆసక్తికరంగా మారింది. ఈ వివాదా సంఘటన వివరాల్లోకి వెళితే...

ముంబై పోలీసులు ఘాటుగా
ఆలియా భట్ చేసిన పోస్టుపై ముంబైకి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ.. మీ వ్యక్తిగత స్వేచ్చను హరించిన ఫోటోగ్రాఫర్లపై ఖార్ పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకొంటే చేయండి. మేము ఆ ఫోటోగ్రాఫర్లపై కఠిన చర్యలు తీసుకొంటాం అని అన్నారు. ఈ మేరకు ఆలియా పీఆర్ టీమ్‌తో పోలీసులు స్పందిస్తూ ఉన్నారు. అలాగే మీడియా సంస్థ దృష్టికి కూడా ఈ వివాదాన్ని ఆలియా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

దొంగచాటుగా ఫోటోలు పిల్లల వ్యవహారమా?
తన ఇంటిలో ఉండగా, కొందరు పక్క భవనం నుంచి తన అనుమతి లేకుండా తనను ఫోటోలు తీయడంపై ఆలియాభట్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. పిల్లల వ్యవహారం అనుకొంటున్నారా? నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నిస్తారా? నేను నా లివింగ్ రూమ్‌లో ఉండగా.. తనను ఎవరో ఫోటోలు తీస్తున్నారనే విషయం నా దృష్టికి రావడంతో ఆందోళనకు గురయ్యాను. నా పొరుగింటి నుంచి ఓ వ్యక్తి కెమెరాను నాకు గురిపెట్టి ఫోటోలు తీయడం సరికాదు అంటూ పోస్టు పెట్టి ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు. దాంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగారు.

ఆలియాకు భారీ మద్దతు
నా ప్రైవేట్ లైఫ్‌కు భంగం కలిగించేలా ఫోటోగ్రాఫర్లు వ్యవహరించారు. నా వ్యక్తిగత జీవితంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు అంటూ ఆలియా భట్ పెట్టిన పోస్టుపై సినీ తారల నుంచి భారీ స్పందన వ్యక్తమవుతున్నది. అనుష్క శర్మ, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, కరణ్ జోహర్ లాంటి వాళ్లు ఆలియాభట్‌కు అండగా నిలుస్తున్నారు.

అనుష్క శర్మ ఓపెన్ అవుతూ..
ఆలియాభట్‌కు జరిగిన చేదు అనుభవాన్ని గురించి అనుష్క శర్మ స్పందిస్తూ.. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. ఇతరు ప్రైవేట్ లైఫ్‌కు, వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి. ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గు చేటు. పలు మార్లు చెప్పినా నా ఇంటిలోని నా కూతురు ఫోటోలను తీసేందుకు ప్రయత్నించారు. ఆ విషయం నాకు చాలా బాధకలిగించింది అని అనుష్కశర్మ చెప్పారు.


Click it and Unblock the Notifications











