twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కష్టాల్లో టిక్‌టాక్ స్టార్‌: లాక్‌డౌన్ బేఖాతరు, అభ్యంతరకర వీడియోపై కేసు నమోదు

    |

    కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించి టిక్‌టాక్ సార్ ఫైసల్ ఖాన్ కష్టాల్లో పడ్డాడు. కరోనా ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలు వివాదమయ్యాయి. దాంతో ఫైసల్ ఖాన్ పై ముంబైకి చెందిన అడ్వకేట్ కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

    అభ్యంతరకరమైన వీడియోలతో

    అభ్యంతరకరమైన వీడియోలతో

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ఇంట్లో ఉండకూడదు అనే విధంగా చేసిన టిక్ టాక్ వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లోని సైబర్ క్రైమ్ సెల్ విభాగంలో కేసు నమోదైంది. దీంతో టిక్‌టాక్ స్టార్ ఫైసల్‌పై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

    లాక్‌డౌన్ పిరియడ్‌ నిబంధనల ఉల్లంఘన

    లాక్‌డౌన్ పిరియడ్‌ నిబంధనల ఉల్లంఘన

    లాక్‌డౌన్ పిరియడ్‌లో ఇంట్లో నుంచి బయటకు రమ్మనే విధంగా రెచ్చగొట్టే వీడియోలను ఫైసల్ ఖాన్ మూడు రోజుల క్రితం విడుదల చేశాడు. దేశంలోనే కాకుండా విదేశాల్లోని చాలా మంది టిక్ టాక్ అభిమానులను ఆయన ప్రభావితం చేయగలుగుతాడు. ఫైసల్ ఖాన్ చర్యలు ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనే. అందుకే ఆయనపై సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశాను అని అడ్వకేట్ అలీ కాషిఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు.

    టిక్‌టాక్‌లో వీడియోలు

    టిక్‌టాక్‌లో వీడియోలు

    మ‌ృత్యువును కూడా ఎదిరించ గలిగే శక్తి నా వద్ద ఉంది అంటూ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ డైలాగ్స్‌తో వీడియో టిక్‌టాక్‌లో పెట్టాడు. అలాగే తన మిత్రుడితో కలిసి వీధుల్లో తిరుగుతున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఫిర్యాదు తర్వాత అది పాత వీడియో అంటూ డిలీట్ చేశాడు. ఇలాంటి చర్యల వల్ల సమాజంలో జరుగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది అని అడ్వకేట్ అలీ మీడియాకు వెల్లడించారు.

     కేసు నమోదు నిజమే

    కేసు నమోదు నిజమే

    టిక్‌టాక్ స్టార్ ఫైసల్ ఖాన్‌పై ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదును అంబోలి పోలీస్ స్టేషన్‌కు పంపాం. ఆయనపై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించాం. విచారణలో వెల్లడయ్యే వాస్తవాలను మీడియాకు వెల్లడిస్తాం. అప్పటి వరకు ఈ కేసు గురించి పెద్దగా వివరాలు అందించలేం. ఈ కేసును అంబోలి పోలీసులు చూసుకొంటున్నారు అని డీసీపీ సైబర్ క్రైమ్ విభాగం విశాల్ ఠాకూర్ తెలిపారు.

    Recommended Video

    Thugs of Hindustan Box Office Collections Drops
    గతంలో టిక్ టాక్ అకౌంట్లు బ్యాన్

    గతంలో టిక్ టాక్ అకౌంట్లు బ్యాన్

    నిబంధనలు అతిక్రమించారనే కారణంతో 2019లో ఫైసల్, హస్నైన్‌కు సంబంధించిన టిక్ టాక్ అకౌంట్లను రద్దు చేశారు. ఆ సమయంలో వీరిద్దరి అకౌంట్లు రద్దు చేయడం తప్పు అంటూ ఇదే అడ్వకేట్ వారికి సహకరించారు. వారికి బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా కేసు నమోదు చేయడంపై ప్రస్తుత పరిస్థితుల కారణంగా వారిపై కేసు నమోదు చేయాల్సి వచ్చిందని తెలిపారు.

    English summary
    Mumbai's Amboli Police files a case on Tiktok star Faisal Shaikh. An advocate files on case, showing that voilation of Lockdown situation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X