twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగన రనౌత్‌కు ముంబై కోర్టు షాక్.. పరువు నష్టం కేసులో ఎదురుదెబ్బ!

    |

    బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్‌ మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ప్రముఖ రచయిత జావెద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కంగనకు ఎదురు దెబ్బ తగిలింది. కంగన తీరుతో అసహనం చెందిన ముంబై కోర్టు సీరియస్ అయింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

    పరువు, ప్రతిష్టకు భంగం

    పరువు, ప్రతిష్టకు భంగం

    కంగన రౌనత్ చేసిన వ్యాఖ్యలపై జావేద్ అఖ్తర్ స్పందిస్తూ.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధారణమైన ఆరోపణలు చేయడం చాలా బాధ కలిగింది. తాను చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసును దాఖలు చేశాను. కంగనతో తాను కోర్టులోనే తేల్చుకొంటాను అని అప్పట్లో ఘాటుగా స్పందించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో జావేద్ అఖ్తర్ నాయకత్వంలో ఓ కోటరి ఉంది. వారి కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకొంటున్నాయని ఆరోపించింది.

    జుహూ పోలీసులకు ఆదేశాలు

    జుహూ పోలీసులకు ఆదేశాలు

    జావేద్ అఖ్తర్ పిటిషన్‌ను ముంబైలోని అంధేరీ కోర్టు పరిగణనలోకి తీసుకొన్నది. ఆ తర్వాత జావేద్ అఖ్తర్ పరువునష్టం కేసులో వాస్తవాలు బయటకు లాగేలా విచారణ జరిపించాలని డిసెంబర్ 2020లో జుహూ పోలీసులకు కోర్టు ఆదేశాలించింది.

    కంగన ఇంటర్య్యూలో కొన్ని వ్యాఖ్యలు

    కంగన ఇంటర్య్యూలో కొన్ని వ్యాఖ్యలు

    జావేద్ అఖ్తర్ పరువునష్టం కేసులో విచారణ జరిపిన జుహూ పోలీసులు ఈ మేరకు కొన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత ఓ జాతీయ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలను కోర్టు సమర్పించారు. ఆ క్రమంలో మార్చి 1వ తేదీన కోర్టులో హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.

    కంగనకు బెయిలబుల్ వారెంట్లు జారీ

    కంగనకు బెయిలబుల్ వారెంట్లు జారీ

    జావేద్ అఖ్తర్ పరువు నష్టం కేసులో జారీ చేసిన సమన్లపై కంగన రనౌత్ స్పందించకపోవడంతో బాంద్రా కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ మార్చి 26వ తేదీన కోర్టు చేపట్టనున్నది.

    English summary
    As per ANI, Mumbai's Metropolitan Magistrate Court, Andheri issues a bailable warrant against Kangana Ranaut in a defamation case filed against her by Javed Akhtar. Court issues the warrant after she failed to appear before it despite being summoned. Matter to be next heard on 26th March
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X