షరాన్ స్టోన్ సెక్సీగా నటించిన "బేసిక్ ఇన్ స్టింక్" అప్పట్లో ప్రంపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు దాని ఫ్రీమేక్ లో ముమైత్ ఖాన్ నటిస్తోంది. టార్గెట్ పేరుతో తయారవుతున్న ఈ చిత్రంపై దర్శక, నిర్మాతలకే కాక ప్రేక్షకులలోనూ ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా బేసిక్ ఇన్ స్టింక్ లో షరాన్ స్టోన్ నగ్నంగా మోకాళ్ళు ముడుచుకుని కూర్చునే సీను బాగా పాపులర్. ఆ సీను యధాతధంగా తీస్తారా మారుస్తారా అని అభిమానులు ఆలోచనలో పడుతున్నారు .ఎందుకంటే మార్లిన్ మన్రో క్లాసిక్ "సెవన్ ఇయర్స్ ఇచ్" తెలుగులో 'అదిరిందయ్యా చంద్రం' గా తెరకెక్కినపుడు అందులో మన్రో గౌను గాలికి ఎగిరే సీను యాజ్ ఇటీజ్ గా హీరోయిన్ సంగీత పై తీసారు. అలాగే ఈసారి జరుగుతుంది అని ఆశ పడుతున్నారు. ఏమో ఎవరి అదృష్టమెలాగుందో రిలీజు అయితే గాని తెలియదు.