మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి అసలు పేరు ఆయన్ను చిక్కుల్లో పడేసింది. అమెరికా విమానాశ్రయ అధికారులు అనుమానంతో ఆయన్ను రెండు గంటల పాటు ప్రశ్నించారు. మమ్ముట్టి ఇక్కడి జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి ఏప్రిల్ 29న చేరుకున్నారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీ లో ఆయన వివరాలు పరిశీలించినప్పుడు 'మహమ్మద్‌కుట్టి ఇస్మాయిల్ పణిపరంబిళ్' అని కంప్యూటర్‌పై కనిపించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయన్ను ప్రత్యేక గదికి విచారణ నిమిత్తం తరలించారు. భారత్‌లో ఆయన పేరున్న పెద్ద కథానాయకుడని దౌత్య అధికారులు వివరించటంతో ఎట్టకేలకు మమ్ముట్టి బయటపడ్డారు. 'మహమ్మద్ ఇస్మాయిల్' అనే పేరున్న వ్యక్తులను క్షుణ్నంగా తనిఖీ చేయాలని తమకు పైనుంచి ఆదేశాలున్నందున ఇలా వ్యవహరించినట్లు అధికారులు చెప్పారు.
Story first published: Thursday, May 7, 2009, 11:04 [IST]