twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'హోమం' పై పారిశుధ్య దుమారం

    By Staff
    |

    Homam
    ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతీ ఒక్క తెలుగు సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. కంత్రి,గోరింటాకు,రెడీ తర్వాత ప్లేసులో ఇప్పుడు హోమం చిత్రం చేరింది. ఈ సినిమాలో పారిశుధ్య కార్మికులను కించపరిచేలా డైలాగులు ఉన్నాయంటూ గుంటూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ డైలాగాలు తన మనో భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వెంటనే తొలిగించాలని వారు ర్యాలీ నిర్వహించి డిమాండ్ చేసారు.

    ఆ సంఘ ప్రతినిధులు ఆ వ్యాఖ్యలు తక్షణమే తొలిగించి దర్శకుడు జె.డి చక్రవర్తి వారికి క్షమాపణ చెప్పాలని కోరారు. లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని నగర పారిశుద్య కార్మికుల వెల్ ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణబాబు హెచ్చరించారు. అయితే ఈ రకమైన సంఘటనలు తెలుగు పరిశ్రమకు ఏ విధమైన సంకేతాలు పంపుతున్నాయో మరోసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని సినీ అభిమానులు అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X