twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మున్నాభాయ్- 3 ’ పై దర్శక,నిర్మాతల ప్రకటన

    By Srikanya
    |

    ముంబై: మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003), లగే రహో మున్నాభాయ్ (2006) చిత్రాల సీరిస్... ఆగిపోనుందా...సంజయ్ దత్ జైలుకు వెళ్లటంతో ఆ చిత్రం సీక్వెల్ పరిస్దితి ఏమిటి...ఎన్నాళ్ళగానో ఊరిస్తున్న సీక్వెల్ రెడీ అవటం కష్టమేనా వంటి విషయాలకు నిర్మాత విధు వినోద్ చోప్రా సమాధానమిచ్చారు. సంజయ్ జైలు నుంచి బయటికి వచ్చిన మరునాడే ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటన చేసారు.

    సంజయ్‌దత్ హీరోగా మున్నాభాయ్ పేరుతో రెండు సినిమాలు తీసి భారీ హిట్లు కొట్టిన రాజ్‌కుమార్ హిరాణి, విధువినోద్ చోప్రా ద్వయం మూడోది తీయడానికి కూడా రెడీగానే ఉంది. దాని నిమిత్తం చాలా కాలంగా స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. అయితే ఊహించని విధంగా ...1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే సంజయ్‌కు ఐదేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇతడు ఇదివరకే 18 నెలలు జైల్లో గడిపినందున, మరో మూడున్నరేళ్లు కారాగారవాసం చేయాల్సి ఉంటుంది.

    మంచి మనసున్న గూండాగా సంజయ్‌దత్ మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003), లగే రహో మున్నాభాయ్ (2006)లో కనిపించాడు. హీరో అనుచరుడిగా అర్షద్‌వార్సీ నవ్వించాడు. 'మున్నాభాయ్ వచ్చేదాకా మేం ఎదురుచూస్తాం. మూడోదాంట్లో సంజయ్ తప్పకుండా నటిస్తాడు' అని చోప్రా ప్రకటించాడు. సంజూ ఇది వరకే జైలు జీవితం గడిపాడని, ఎన్నో కష్టనష్టాలు కూడా అనుభవించినందున ప్రభుత్వం అతనికి క్షమాభిక్ష పెట్టాలని కోరారు.

    'జైల్లో గడపడం నిజంగా కఠినమైన అనుభవమే. అయితే మళ్లీ అక్కడికి వెళ్లడానికి నేను తయారుగా ఉన్నాను. బయటికి వచ్చాకే నాకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. గత 20 ఏళ్లుగా నన్ను వేధిస్తున్న కోతి (బాధ) నుంచి నాకు విముక్తి దొరుకుతుంది. జైలు నుంచి బయటికి రాగానే నేరుగా మున్నాభాయ్- 3 షూటింగ్‌సెట్‌కు వెళ్తాను' అని సంజయ్ చెప్పినమాటలను చోప్రా వివరించారు.

    'జైళ్లు మనిషిని సంస్కరించాలి గానీ అతనిపై పగతీర్చుకునేలా ఉండకూడదు. సంజయ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతడు ఒక మంచి పౌరుడు' అని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన జాలీ ఎల్‌ఎల్‌బీ తీసిన సుభాష్ కపూర్ మూడో మున్నాభాయ్‌కు దర్శకత్వం వహిస్తాడు అని తెలిపారు.

    English summary
    The third installment of the Munna Bhai franchise will be made only after the return of Sanjay Dutt from the prison. Filmmakers Rajkumar Hirani and Vidhu Vinod Chopra confirmed the news in a joint statement. "Just two days back Sanjay called and said, 'It's tough to be in prison but I'm ready to go there because when I come back, I will experience freedom in its true sense. I will be rid of this monkey who has been sitting on my back for the last 20 years and scaring me'. When I walk out of prison, I want to walk straight onto the sets of 'Munna Bhai'," Hirani and Chopra said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X