మలైకా చూపిన కవ్వింతలకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్..!

By Sindhu

'దబాంగ్' సినిమాలోని 'మున్నీ బద్నాం హోయి..' పాట గత సంవత్సరం దేశాన్ని ఓ ఊపు ఊపేసిన సంగతి మనకు తెలుసు. ఆ పాటలో మలైకా అరోరా చూపిన కవ్వింతలకి కుర్రాళ్ళంతా ఫిదా అయిపోయారు. అందుకే, ఆ డ్యాన్స్ నంబర్ వన్ అవార్డులు కొట్టేసింది. తాజాగా ఈ పాట మరో సరికొత్త రికార్డుని సాధించడమే కాకుండా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కింది.

ఈ డ్యాన్స్ నంబర్ కి మలైకా అరోరా తో కలిసి 1200 మంది మూడు నిమిషాల పాటు డ్యాన్స్ చేసారు. 'ఇండియన్ ఫిలిం ఫెస్టివ్ 2011' ఆద్వర్యంలో ఈ ముచ్చట ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ పార్కులో తాజాగా జరిగింది. ఇంతమంది ఒకే పాటకి ఒకేసారి డ్యాన్స్ చేయడమన్నది రికార్డ్ కావడంతో గిన్నిస్ నిర్వాహకులు దీనిని నమోదు చేసుకుని, మలైకాకు సర్టిఫికేట్ ని అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు హీరోయిన్ విద్యాబాలన్ కూడా ఉత్సాహంగా పాల్గొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X