ప్రివ్యూ ఫిల్మ్‌తో ముంతాజ్ రీఎంట్రీ
కొచ్చి: మలయాళ సినిమాలో ముంతాజ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆఫర్లు లేకపోవడంతో కొద్ది రోజుల పాటు సినీ పరిశ్రమకు దూరమైన ఈ బొద్దందాల ముద్దుగుమ్మ ముంతాజ్ మలయాళ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోంది. ప్రివ్యూ అనే మలయాళ సినిమాలో ముంతాజ్ రీ ఎంట్రీ ఇవ్వనుందని సినీ వర్గాల సమాచారం. వివాహం తర్వాత నటించబోనని చెప్పి, కుటుంబ జీవితం గడిపే ఒక నటీమణి స్టోరీతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
ఇందులో ముంతాజ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ చెబుతోంది. పెళ్లికి తర్వాత నటించబోమని చెబుతున్న పలు మలయాళ నటీమణులు వాగ్ధానాన్ని కాపాడుకోలేకపోయారు. నటీమణుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ముంతాజ్ గ్లామర్ రోల్ పోషిస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. మరో అందాల తార లక్ష్మీరాయ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications












