మమ్మల్ని రోడ్డుపైకి లాగొద్దు

By Staff

చెన్నయ్‌: గుట్టుగా జీవితం గడుపుతున్న తమని అనవసరంగా బయటికి లాగొద్దని నటుడు శోభన్‌ బాబు కుమారుడు కరుణశేషు విజ్ఞప్తి చేశారు. 'గుట్టుగా మా బతుకేదో మేం బతుకుతున్నాం. ఏనాడూ రోడ్డెక్కలేదు. అనవసరంగా మమ్మల్నెందుకు రోడ్డుపైకి కీడుస్తారు? దయచేసి మా జోలికి రావద్దు' అని కరుణ శేషు విజ్ఞప్తి చేశారు. శోభన్‌బాబు మరణానంతరం చెక్కు బుక్కులు, బ్యాంకు అకౌంట్ల విషయంలో ఆయన కుటుంబసభ్యులు గొడవ పడ్డప్పుడ్డారంటూ బాబూ మోహన్ చేసిన వ్యాఖ్యలపై మనస్తాపం చెందిన ఆయన ఇలా స్పందించారు.

అలాగే బాబుమోహన్..అన్ని వేలకోట్లు సంపాదించిన శోభన్‌బాబు కూడా మరిణించేప్పుడు తన వెంట ఏమీ తీసుకెళ్లలేదని..అందరినీ వదిలి అనాథలాగా వెళ్లిపోయారని బాబుమోహన్‌ అన్నారు. తాను ప్రాణప్రదంగా పెంచుకున్న తోట (శాంతినికేతన్‌)లో తన పార్థివ దేహాన్ని సమాధి చేయాలన్న ఆయన కోరిక కూడా నేరవేరలేదని అంటూ కామెంట్స్ చేసారు.

బాబూమోహన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను చిత్ర పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కె.ఎస్‌.రామారావు ఖండించారు. మచ్చలేని మనిషిగా..ఎంతో గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపిన శోభన్‌బాబు పట్ల బాబూమోహన్‌ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని చెప్పారు.

ఇక బాబూ మోహన్ క్షమాపణ చెప్పి తన కాంట్రావర్శి స్టేట్ మెంట్స్ ని ఉపసంహరించుకోవాలని దాసరి, మురళి మోహన్ డిమాండ్ చేసారు. ఇది చాలా దారుణం, మరణించిన వ్యక్తి, అతని కుటుంబంపై ఇటువంటి వ్యాఖ్యలు వినపడటం అన్నారు. అలాగే శోభన్ బాబుకీ, అతని ఫ్యామిలీ మెంబర్స్ కీ మధ్య మంచి ఆరోగ్యకరమైన అనుబంధం ఉండేదని మురళిమోహన్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X