'అతడు' సినిమాకు బ్లాంక్ చెక్ ఇచ్చా.. కుదరదని చెప్పారు, ఆయన గొప్పతనం అదే!

తెలుగు చలనచిత్ర రంగంలో సోగ్గాడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది శోభన్ బాబు మాత్రమే. అప్పట్లోనే మహిళల్లో ఎక్కువ క్రేజ్ పొందిన హీరో శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలకు శోభన్ బాబు పెట్టింది పేరు. ఒక దశలో శోభన్ బాబు సినిమాల నుంచి తనకు తానుగా రిటర్మెంట్ ప్రకటించుకున్నారు. ఆ తరువాత ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంత బలమైనవో దీనిని బట్టే అర్థం అవుతుంది. శోభన్ బాబు సేవ సమితి పేరుతో ఆయన అభిమానులు సినీ పురస్కారాలు అందించాలని నిర్ణయించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ లో తొలిసారి ఘనంగానిర్వహించబోతున్నారు. ఈ వేడుక గురించి చర్చించడానికి మురళి మోహన్ హాజరయ్యారు.

బ్లాంక్ చెక్ పంపా

బ్లాంక్ చెక్ పంపా

శోభన్ బాబు గారు ఎంత గొప్ప వ్యక్తో చెప్పడానికి నేను ఓ ఉదాహరణ చెబుతా అని మురళి మోహన్ అన్నారు. తాను నిర్మించిన అతడు చిత్రంలో కీలక పాత్ర కోసం సరైన నటుడిని అన్వేషిస్తున్నాం. ఆ సమయంలో శోభన్ బాబు అయితే బావుంటుందని భావించాం. ఈ చిత్రంలో ఆయన నటించేందుకు బ్లాంక్ చెక్ పంపించా. కానీ ఆ ఆఫర్ ని శోభన్ బాబు సున్నితంగా తిరస్కరించి తన గొప్పతనాన్ని చాటుకున్నారని మురళి మోహన్ తెలిపారు.

ఘనమైన నివాళి

ఘనమైన నివాళి

శోభన్ బాబు పేరు మీద అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళి అందించడమే అని పరుచూరి వెంకటేశ్వర అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. శోభన్ బాబు నటించిన చిత్రాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. సెట్ కి వచ్చి తన పని తాను చేసుకుని వెళతారు. ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడేవారు కాదు అని రేలంగి నరసింహా రావు అన్నారు.

మహిళా అభిమానులు

మహిళా అభిమానులు

టాలీవుడ్ కు మహిళా అభిమానుల సంఖ్యని పెంచిన క్రెడిట్ శోభన్ బాబు గారికే దక్కుతుందని దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి అన్నారు. శోభన్ బాబు మంచి తనాన్ని ఆయన అభిమానులు కొనసాగించాలని నిర్ణయించుకోవడం శుభపరిణామం అని అన్నారు. భౌతికంగా దూరమైనా శోభన్ బాబు అభిమానుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయే నటుడు అని అన్నారు.

 డిసెంబర్ 25

డిసెంబర్ 25

ఈ నెల 25 న శోభన్ బాబు సేవ సమితి నిర్వహించే అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరగనుంది. అందుకు సంబందించిన ఏర్పాట్లు హైదరాబాద్ ఎన్ కన్వెక్షన్ సెంటర్ లో భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మీడియాకు తెలియజేయడానికి మురళి మోహన్, పరుచూరి వెంకటేశ్వర రావు లాంటి ప్రముఖులతో మీడియా సమావేశం నిర్వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X