మురళీ మోహన్ మరోసారి వార్నింగ్
హీరోయిన్స్ కి మరోసారి 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో నటిస్తున్న కొంత మంది పరభాష తారలు ముఖ్యంగా హీరోయిన్లు ఇప్పటివరకూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం తీసుకోకపోవడంతో కన్నెర్ర చేసిన 'మా' కార్యవర్గం వెంటనే సభ్వత్వం తీసుకోవాలని కోరుతూ ఇందుకోసం సెప్టెంబర్ 30 వరకూ గడువు విధించింది. ఈ మేరకు సుమారు 14 మంది ఆర్టిస్టులకు నోటీసులు జారీ చేసింది. వీరిలో సమంత, త్రిష, తమన్నా, నిత్యమీనన్, జెనీలియా, పార్వతీ మెల్టన్, కాజల్ అగర్వాల్ ఉన్నారు.
అలాగే దగ్గుబాటి రానా, తమిళనటుడు విజయకుమార్ కూడా సభ్యత్వం తీసుకోలేదు. అయితే నోటీసులు జారీ చేసాక కొందరు సభ్యత్వం తీసుకున్నారు. ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు. ఆ విషయమై మీడియాతో మాట్లాడుతూ... అధిక శాతం మంది వెంటనే స్పందించి 'మా'లో సభ్యత్వం తీసుకున్నారు. ఇంకా సభ్యతం తీసుకోని వారికి భవిష్యత్తులో ఎలాంటి సహకారం అసోసియేషన్ తరఫున అందివ్వమని తెలిపారు. అలాగే .."వారికిచ్చిన గడువు ముగిసిపోయింది. మరోసారి వారికి నోటీసు ఇవ్వడమా లేక సహాయ నిరాకరణ చేయడమా అన్నది సోమవారం జరిగే కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం' అన్నారాయన.
దగ్గుపాటి రానా తెలుగు వాడైనా మా అశోశియేషన్ ని లెక్కచేయకపోవటం, సురేష్ బాబు ప్రతీ విషయంలోనూ మాట్లాడుతూంటారు..కదా ఆయన కుమారుడు కూడా ఇలా తీసుకోకపోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.


Click it and Unblock the Notifications











