ఆ వెబ్ సైట్స్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం...మురళీ మోహన్
ఈ మధ్య కొన్ని వెబ్ సైట్లలో 'మా' గురించి లేనిపోని వార్తలు వస్తున్నాయి. నిధులు దుర్వినియోగం చేస్తున్నామని రాస్తున్నారు. అంత అవసరం మాలో ఏ ఒక్కరికీ లేదు. ఉన్నవీ లేనివీ రాస్తే...చట్టపరంగా చర్యలు తీసుకొంటామని కూడా ఈ సంప్రదాయం కొనసాగిస్తాం అన్నారు 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షులు మురళీమోహన్ హెచ్చరించారు. అలాగే మా వెబ్ సైట్ మూతపడిందని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదని 'మా' శేఖర్ చెప్పారు. గురువారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.


Click it and Unblock the Notifications











