చిరంజీవి పెద్ద రౌడీ అని ఆయన.. ఇండస్ట్రీకి మొగుడని నేను.. మురళీ మోహన్ కామెంట్స్
టాలీవుడ్‌లో హీరోగా, నిర్మాతగా, బిజినెస్‌మ్యాన్‌గా, మా ప్రెసిడెంట్‌గా ప్రఖ్యాతి గాంచిన నటుడు మురళీమోహన్. స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గరి నుంచి యంగ్ హీరోల వరకు నటించాడు మురళీ మోహన్. శోభన్ బాబు, కృష్ణ సమకాలీకుడిగా స్టార్ స్టేటస్ అనుభవించిన మురళీ మోహన్ ఆ తరువాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ నాటి సంగతులను వివరించాడు.

అలా ఎన్టీఆర్‌ను మొదటి సారి..
ఎన్టీఆర్ మేకప్‌మ్యాన్ పీతాంబరం నిర్మించిన మొదటి చిత్రంలో ఎన్టీ రామారావు, బాలకృష్ణ, తాను కలిసి నటించామని తెలిపాడు. ఈ మూవీ గురించి మాట్లాడటానికి వెళ్లినప్పుడు మొదటిసారి ఎన్టీఆర్‌ను చూశానని, చూడగానే కాళ్ల మీద పడిపోయానని తెలిపాడు. అది ఆయన పవర్ అని చెప్పుకొచ్చాడు.

కాలేజీ రోజుల నుంచీ..
కాలేజీ రోజుల నుంచి కృష్ణ పరిచయమేనని, ఓ సారి తమ కాలేజీకి దర్శకుడు తిలక్ వచ్చారని తెలిపాడు. అలా వచ్చిన ఆయన కృష్ణను చూసి హీరోగా అవకాశమిస్తా.. చెన్నైకి రమ్మనడంతో ఆయనకు కాలేజీలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిందని అన్నాడు.

మనవూరి పాండవులు సమయంలో..
చిరంజీవిని మొదటి సారిగా మనవూరి పాండవులు సినిమా సమయంలోనే కలిశానని అన్నాడు. అన్నయ్య అని పిలిచేవాడని, ఇప్పటికీ అలానే పిలుస్తాడని మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు. ఆ మూవీ టైమ్‌కు కృష్ణంరాజు, తాను మాత్రమే పెద్ద హీరోలమని మిగతా వారంతా కొత్తవారేనని అన్నాడు. అప్పటికీ చిరంజీవి నటించిన ఏ సినిమా విడుదల కాలేదని తెలిపాడు.
Recommended Video

కృష్ణంరాజు అలా అన్నాడు..
ఓ రోజు షూటింగ్ జరుగుతూ ఉంటే.. చిరంజీవి కళ్లు బాగున్నాయని, వాటితోనే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడని ఆయన కచ్చితంగా పెద్ద రౌడీ అవుతాడని కృష్ణంరాజు అన్నట్లు తెలిపాడు. అయితే తాను మాత్రం ఇండస్ట్రీకి మొగుడవుతాడని చెప్పినట్టు పేర్కొన్నాడు. అదే నిజమైందని సరదాగా నవ్వాడు.


Click it and Unblock the Notifications











