మేము కన్నెర్ర చేస్తే భస్మమే...!
ఇవ్వాళ సినిమా పరిశ్రమ మద్రాసు నుండి టోటల్ గా హైద్రాబాద్ షిష్ట్ అవ్వడానికి కారణం హైద్రాబాద్ ఆంద్రప్రదేశ్ రాజధాని కనుక. ఇది ప్రత్యేక తెలంగాణ అని ఆనాడే అంటే ఇన్ని స్టూడియోలు, ఇన్ని ఖరీదైన ఇళ్లు ఇక్కడ కట్టుకునే వాళ్లం కాదు. ఇవ్వాలా ఇంత ఆందోళనకు గురికావల్సిన అవసరం వుండేది కాదు అంటూ సినీ నటుడు మురళీ మోహన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు.సినీ పరిశ్రమలకూ, ఇతరాత్ర పరిశ్రమలకు పెట్టిన పెట్టు బడుల్ని, గత 50 సంవత్సరాల నుండి సాధించిన అభివద్దిని ఇక్కడ వదిలేసి వెళ్లిపోమ్మంటే ఎవరు పోతారు అంటూ తెలంగాణ యోధుల్ని ప్రశ్నిస్తున్నాడు.
నిజానికి సినిమా పరిశ్రమ తరలిపోవాలంటే కేవటం వారం రోజులు చాలు అలాంటి పరిస్థితే వస్తే తెలంగాణ వాళ్లు తరతరాలు జానపదం పాటలు పాడుకుంటూ, భోనాలు చేసుకుంటూ పోతరాజుల వేషాలతో వుండిపోవాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుందని వారికి హచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇదిలా వుంటే విజయవాడ ఎమ్ పి రాజగోపాల్ వేరే విధంగా స్పందిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే హైద్రాబాద్ ఆంద్రప్రదేశ్ కు రాజధాని అని ఆంధ్రులు ఇక్కడకు వచ్చారు తప్ప తెలంగాణ సిరి సంపదలతో తుల తూగుతుందని కాదు అంటూ విమర్శస్తున్నాడు.
అయినా ఇక్కడకు ఆంధ్రులు వచ్చింది మీకు తెలివి తేటలు నేర్పడానికి మీకు తిండి తిప్పలు అలవాటు చేయడానికి మీ భాషను అభివద్ది చేయడానికి మీఇళ్లకు అద్దెలు కట్టి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి. అంతే కానీ వారేదో మిమ్మల్ని దోచుకోవడానికి అన్నట్టుగా భావించి అన్నం పెట్టిన చేతిని నరకడానికి ప్రయత్నిస్తున్నారంటూ రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











