మరోసారి 'మా' అధ్యక్షుడిగా మురళీ మోహన్

'మా' ఉపాధ్యక్షులుగా నాగబాబు, మంచు విష్ణు; ప్రధాన కార్యదర్శిగా అలీ, కోశాధికారిగా శివాజీ రాజా, సంయుక్త కార్యదర్శులుగా జి.మహర్షి, వేణుమాధవ్‌లు ఎన్నికయ్యారు. ఈ పదవులకు పోటీ రాలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా సినీ నటుడు, నిర్మాత మురళీ మోహన్ మరోమారు ఎంపికయ్యారు. 'మా' అధ్యక్ష పదవికి మురళీ మోహన్‌పై పోటీగా ఎవరూ బరిలో నిలవకపోవడంతో, ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నాగబాబు కొనసాగుతుండగా, కోశాధికారి శివాజీరాజా ఎన్నికయ్యాడు
కోటశ్రీనివాసరావు, శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శిగా ఆహుతి ప్రసాద్, నిర్మాత గణేష్ కోశాధికారి పదవి కోసం పోటీపడ్డారు. ఇక 'మా' ఎన్నికల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ అధ్యక్షుడిగా మురళీ మోహన్ తిరిగి ఎన్నికవడం పట్ల టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఆయన నిబద్ధత గల వ్యక్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా తనను తిరిగి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సినీ రంగానికి కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











