కోర్టు తీర్పు తర్వాతే స్పష్టత: మురళీమోహన్

By Srikanya

హైదరాబాద్ : 'మా' ఫలితాలు ఎప్పుడు వెల్లడిచేస్తామన్నది మంగళవారం తెలుస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మురళీమోహన్ తెలిపారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, తీర్పు వెలువడిన తర్వాత ఎన్నికల ఫలితాల ఎప్పుడు వెల్లడిస్తామన్న అన్న దానిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2గంటల వరకు జరగనుంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జయసుధ,రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అలాగే సుమన్ సైతం ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలకు సంభందించిన అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు వన్ ఇండియా తెలుగు అందిస్తుంది.

Murali Mohan on Maa elections

బయిటకు వచ్చాక...తనకు నమ్మకమున్న వ్యక్తికి ఓటు వేశానని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం జరుగుతున్న మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఆయనను మీడియా పలకరించింది

. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మనసుకు నచ్చిన, నమ్మకమున్న వ్యక్తికి తన ఓటు ఉపయోగించానని చెప్పారు. మా పనితీరు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా.. మున్ముందు బాగుందా అనే విషయం తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ప్యానెల్ పనితీరు అనంతరం ఏ విషయమైన చెప్పగలమని అన్నారు. అలాగని, గతంలో పనిచేసిన ప్యానెల్ సరిగా పనిచేయలేదని చెప్పబోనని, వారు మంచే చేశారని, వచ్చే కొత్త ప్యానెల్ మరింత బెటర్ గా పనిచేస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు.

తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘంలోని 702 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 'మా' అధ్యక్ష పదవి ఎన్నికపై సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల ఆసక్తి నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి జయసుధతో పాటు బొమ్మరిల్లు ధూళిపాళ్ల అనే మరో నటుడు ఉన్నారు. మా ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం పరిధిలోకి చేరినందువల్ల ఇవాళ పోలింగ్‌ మాత్రమే జరుగుతుంది. ఫలితాలు కోర్టు తుది తీర్పు తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.

జయసుధ, రాజేంద్రప్రసాద్‌ ప్యానెళ్ల మధ్య హోరీహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్‌ జరగనుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఉన్న కోర్టు ఆదేశాల మేరకు నేడు కౌంటింగ్‌ ఉండదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికలపై సినీ జనాలతోపాటు సామాన్యులు కూడా ఆసక్తి పెంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X