'మా' అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఆయనే తిరిగి...
మూవీ ఆర్టిస్ట్స్ అసోనియేషన్ (మా) అధ్యక్షునిగా మురళీ మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మురళీ మోహన్ ఈ పదవికి ఇప్పటికి వరుసగా రెండు సార్లు ఎంపికయ్యారు. కోశాధికారిగా కోట, శివాజీ రాజా పోటీపడుతున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఆహుతి ప్రసాద్, గణేష్ పోటీపడుతున్నారు. ఇక మా అధ్యక్ష్యుడుగా మురళిమోహన్ తిరిగి ఎంపికకావటం పట్ల అన్ని వర్గాలు నుండి అభినందనలు అందుతున్నాయి.అలాగే మురళిమోహన్ బయిట ఎటువంటి రాజకీయాల్లో పాల్గొన్నా సినిమా దగ్గరకు వచ్చేసరికి నిష్పక్షపాతంగా వ్యవహించారని, సంస్ధ నిధులను దుర్వినియోగం చేయకుండా సక్రమంగా ఖర్చుపెట్టి, ఆపదసమయంలో పేద కళాకళారులను ఆదుకోవటానికి చర్యలు తీసుకున్నాయని,ఇవన్నీ తిరిగి ఎంపిక కావటానికి అర్హతగా నిలిచాయని సీనీయర్స్ వ్యాఖ్యానించారు.
గణేష్ శివాజి రాజా కోట మురళీ మోహన్ ఆహుతి ప్రసాద్ murali mohan ahuthi prasad ganesh sivaji raja kota president


Click it and Unblock the Notifications