మురళీ మోహన్ రియల్ ఛానల్?
మురళీ మోహన్ కూడా ఎలక్ట్రానిక్ రంగంలోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల కథనం. అయితే ఆయన పెట్టబోయే ఆ ఛానల్ ఏ విధంగా ఉండబోతుందనేది ఇంకా తెలియరాలేదు. ఆయన రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఛానల్ ని పెడుతున్నారని ఒకరంటే, కాదు ఆయన న్యూస్ ఛానల్ పెడుతున్నారని మరొకరంటున్నారు. ఇవేమీ కాదు ఆయన న్యూస్ కమ్ ఎంటర్‍టైనర్ ఛానల్‍ని పెట్టబోతున్నారని మరి కొందరి సినీ పండితులంటున్నారు.
మోహన్ బాబు త్వరలో టీవీ ఛానెల్స్ పెట్టి మీడియా ప్రవేశించనున్నారని అంతటా వినపడుతోంది. న్యూస్ ఛానెల్ కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ ఛానెల్ రూపొందించాలని ప్రయత్నం అని తెలుస్తోంది. తన కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఇప్పటికే టీవీ మీడియాలో తన లక్ష్మీ టాక్ షో తో మంచి పేరు తెచ్చుకోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే అశ్వనీదత్ తన కుమార్తె స్వప్న దత్ తో లోకల్ ఛానెల్ పెట్టి విజయం సాధించటం సైతం వీరికి ప్రేరణగా నిలుస్తోందని చెప్తున్నారు. అలాగే వీరు పెట్టబోయే టీవీ ఛానెల్స్ కు ప్రముఖ పారిశ్రామిక వేత్త విసు కన్సలటెన్సీ సి.సి.రెడ్డి గారు కూడా వెనక ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











