twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు నేను చొక్కాలు పట్టుకోవడానికి కారణం విష్ణు.. అతను హీరోనే కాదు: మురళి మోహన్ కామెంట్స్

    |

    మురళి మోహన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు. హీరోగా, నటుడిగా దాదాపుగా 350 చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. 80వ దశకంలో కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించిన హీరో. తెలుగు సినిమా పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన మురళి మోహన్ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎంతో ఎదిగారు. గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మురళి మోహన్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించారు. ఇది సెకండ్ ఇన్నింగ్స్ గా పేర్కొన్న ఆయన ఓ ఇంటర్వ్యూలో మంచి మోహన్ బాబుతో జరిగిన గొడవకు గల కారణాలను బయటపెట్టారు.

    ఆయిల్ ఇంజిన్ల వ్యాపారం..

    ఆయిల్ ఇంజిన్ల వ్యాపారం..

    నటుడిగా, హీరోగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మురళి మోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. 1940 జూన్ 24 పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించిన ఆయన తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు. 1963 సంవత్సరంలో ఎలక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజిన్ల వ్యాపారం ప్రారంభించిన మురళి మోహన్ తర్వాత విజయవాడలో నాటకాలలో నటించడం ప్రారంభించారు.

     జగమే మాయ చిత్రంతో..

    జగమే మాయ చిత్రంతో..

    1973వ సంవత్సరంలో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ చిత్రంతో సినిమాల్లోకి తెరంగేట్రం చేశారు. తర్వాత 1974లో లెజండరీ దర్శకనిర్మాత దాసరి నారాయణ రావు తెరకెక్కించిన తిరుపతి సినిమాతో మురళి మోహన్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. హీరోగా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ వంటి పాత్రలు చేసిన మురళి మోహన్ దాదాపుగా 350కిపైగా తెలుగు సినిమాల్లో నటించారు.

     సుమారు 25 చిత్రాలను..

    సుమారు 25 చిత్రాలను..

    అలాగే మురళి మోహన్ తన సోదరుడు కిశోర్ తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ నిర్మాణ సంస్థ ద్వారా సుమారు 25 చిత్రాలను నిర్మించారు. దీంతోపాటు నేషనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలీం డెవలప్ మెంట్ కార్పొరేషన్స్ లలో వివిధ హోదాల్లో సేవలందించారు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

    హీరోయిన్ కు తాతగా మురళి మోహన్..

    హీరోయిన్ కు తాతగా మురళి మోహన్..

    గత కొంతకాలంగా సినిమాల్లో నటించడం మానేసిన మురళి మోహన్ ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఓ పాత్రలో మెరిశారు. దీంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో హీరోయిన్ కు తాతగా మురళి మోహన్ నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్ ఇకనుంచి తాతగా కనిపిస్తారని చెప్పుకొచ్చారు.

    నాలుగు టీమ్ లు పెట్టి చేద్దాం..

    నాలుగు టీమ్ లు పెట్టి చేద్దాం..

    "అదే ఇంటర్వ్యూలో మోహన్ బాబుతో జరిగిన గొడవ గురించి వివరించారు మురళి మోహన్. ఈ ఇంటర్వ్యూలో మొట్ట మొదటిసారిగా స్టార్ క్రికెట్ అని పెట్టాం. అంటే ఓన్లీ స్టార్స్ తోనే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. నాలుగు భాషల నుంచి కలిపి నాలుగు టీమ్ లుగా చేశాం. అది సక్సెస్ కాలేదు అప్పట్లో. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు కూడా వచ్చారు. దాని తర్వాత నేను (మా) ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తెలుగులోనే నాలుగు టీమ్ లు పెట్టి చేద్దాం" అని పేర్కొన్నారు మురళి మోహన్.

     టీమ్ లను ఫైనలైజ్ చేసేటప్పుడు..

    టీమ్ లను ఫైనలైజ్ చేసేటప్పుడు..

    "చిరంజీవి ఒక టీమ్, నాగార్జున ఒక టీమ్, బాలకృష్ణ ఒక టీమ్, వెంకటేష్ ఒక టీమ్ అని చెప్పి టీ20 అని ఒక పోటి. నలుగురిలో చివరిగా రెండు టీమ్స్ కి ఫైనల్. అదే ఫైనలైజ్ చేశాం. ఆరోజు ఉదయం 9 గంటలకు మొదలు పెడితే రాత్రి 12 అయింది. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా కూడా వచ్చారు. ఇక టీమ్ లను ఫైనలైజ్ చేసేటప్పుడు మోహన్ బాబు గారు వచ్చి.. మా అబ్బాయి విష్ణు ఆడతాడు, విష్ణుకి ఇవ్వండి అని అన్నారు" అని మురళి మోహన్ తెలిపారు.

    సారీ బ్రదర్ ఏదో ఆవేశంతో..

    సారీ బ్రదర్ ఏదో ఆవేశంతో..

    "అప్పుడు విష్ణు సినిమా యాక్టర్ కాదు. ఇది సినిమా స్టార్స్ తో తీసే స్టార్ నైట్ కానీ, ఇది సినిమా హీరో కొడుకుల్నీ, మేనళ్లులను పెట్టి తీసేది కాదు. కుదరదమ్మ అని చెప్పాను. ఏంటీ నేను అడిగిన కూడా కుదరదంటావా అని కొంచెం ర్యాష్ గా అన్నాడు. నేను కూడా ర్యాష్ గా అన్నాను. ఆయన ముందుకొచ్చాడో, నేను ముందుకెళ్లానో తెలియదు గానీ.. ఇద్దరం ఒకరి చొక్కాలు ఒకరం పట్టుకున్నాం. తర్వాత అక్కడున్న వాళ్లు అడిగారు మీకు ఇంత కోపం రావడం ఎప్పుడూ చూడలేదండి అని. రెండు రోజుల తర్వాత మోహన్ బాబు గారు వచ్చి సారీ బ్రదర్ ఏదో ఆవేశంతో ఆరోజు అలా చేశాను అన్నారు" అని మురళి మోహన్ చెప్పుకొచ్చారు.

    English summary
    Senior Actor Murali Mohan Explains About Clashes With Mohan Babu In Star Night Cricket Tournament And Reason Is Manchu Vishnu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X