ప్రకాష్ రాజ్ కు మురళీ శర్మ గట్టిపోటీ
అతిథి సినిమాలో కైజర్ పాత్రలో తెలియకుండా కనపడిన నటుడు మురళీ శర్మ. ఆయన నటన సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్ ను అనుకున్నారు. ఆయనతో చాలా సీన్స్ ను కూడా షూట్ చేశారు. ఆయన షూటింగ్ స్పాట్ కు అనుకున్న సమయానికి రాకపోవడంతో వలన షూటింగ్ కు తీవ్ర అంతరాయం కలిగించడంతో ఆయనను నిర్ధాక్షిణ్యంగా తొలగించి ఆయన స్థానంలో మురళీ శర్మను తీసుకున్నారు. ఆయన తన పాత్రకు సరైన న్యాయం చేశారు. తెలుగులో చక్కగా మాట్లాడే మురళీ హిందీలో తన సత్తానేపుడో నిరూపించుకున్నాడు. అతిథి సినిమా ప్రమోషన్ ఫంక్షన్ కు హాజరయిన మురళీ ఆ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో మహేష్ బాబును పొగడ్తలలో ముంచెత్తాడు. తనకు కోట శ్రీనివాసరావు నటన అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు.


Click it and Unblock the Notifications











