అలాగయితే మల్లిక షెరావత్ ని మర్డర్ చేసినట్లే
సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ అందచందాలతో ఆడిన చిత్రం మర్డర్ అనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ ని తీస్తూ ఆమెను తీసుకోవటం లేదు. ఈ విషయం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే హీరోగా మాత్రం ఇమ్రాన్ హష్మీనే తీసుకున్నారు. ఈ విషయం మర్డర్ 2 దర్శకుడు మొహిత్ సూరి ప్రస్దావిస్తే...'ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేను. కాని హీరోగా ఐమ్రాన్ వుంటారు. త్వరలో హీరోయిన్ ఎంపిక పూర్తవుతుందన్నారు. మల్లికా షెరావత్ తాజా చిత్రం హిస్..స్...స్ ఫెయిలైన నేపధ్యంలో ఆమెకు భాక్సాఫీస్ వద్ద సరైన ప్రారంభ వసూళ్ళు కూడా లేకుండాపోయాయని గమనించిన దర్శక,నిర్మాతలు ఈ నిర్ణాయనికి వచ్చారని తెలుస్తోంది. అయితే ఆమె లేని మర్డర్ సీక్వెల్ ని ఊహించటం కష్టమేనని, ఆమెను ఈ చిత్రంలో లేకుండా చేయటం మర్డర్ చేయటంలాంటిదేనని అంతటా వినిపిస్తోంది.
మల్లికా షెరావత్ మర్డర్ ఇమ్రాన్ హష్మీ మోహిత్ సూరి హిస్ స్ స్ hiss murder mallika sherawat imran hasmi mohit suri


Click it and Unblock the Notifications