twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో హత్య కేసులో నిర్మాతకు విముక్తి

    By Srikanya
    |

    బెంగళూరు : తన వ్యవసాయ క్షేత్రంలో నటుడు,చిన్న చిత్రాల హీరో వినోద్‌కుమార్‌పై కాల్పులు జరిపి హత్య చేశారన్న కేసులో కన్నడ నిర్మాత గోవర్ధనమూర్తిని నిర్దోషిగా పేర్కొంటూ ఇక్కడి సెషన్స్‌ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. గోవర్ధనమూర్తి హత్య చేసినట్లు తగిన సాక్ష్యాధారాల్ని కోర్టుకు సమర్పించటంలో ప్రభుత్వ న్యాయవాది విఫలమైనందున, ఆయన్ను విడుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

    నాలుగేళ్ల క్రితం ఇక్కడికి సమీపంలో నిర్మాత గోవర్ధనకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో నటుడు వినోద్‌కుమార్‌తో కలసి మద్యం సేవించే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో వినోద్‌ హత్యకు గురయ్యారు. మూర్తి తన తుపాకీతో వినోద్‌ను కాల్చిచంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసి ఇక్కడి పరప్పన అగ్రహార జైలుకు పంపారు. పలుమార్లు ఆయన వేసిన బెయిలు అర్జీని హైకోర్టు తోసిపుచ్చింది. సెషన్స్‌ కోర్టులో విచారణ చివరి దశలో గోవర్ధనమూర్తి తన తుపాకీతోనే కాల్పులు జరిపి హత్య చేసినట్లు సరైన ఆధారాల్ని సమర్పించటంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంటూ నిందితుణ్ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

    వినోద్ కుమార్ ..ఇప్పుడిప్పుడే కన్నడ పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న చిన్న నటుడు. అలాగే గోవర్ధన్ రెడ్డి ఈ మద్యనే మాదేష అనే చిత్రాన్ని శివరాజకుమార్ హీరోగా నిర్మించి మంచి విజయం సాధించారు. వీరి ఉమ్మడి మిత్రుడు శంకర్ రెడ్డి అనే రియల్టర్. వీరు ముగ్గురు కలిసి గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్,సినిమా పరిశ్రమలలో పెట్టు బడులు పెడుతూ వ్యాపారం చేసేవారు.

    ఇక గోవర్ధన్ వైల్డ్ గా బిహేవ్ చేయటం ఇదే మొదటిసారి కాదు. మాదేష్ సినిమా సెన్సార్ సమయంలో ఆ సెన్సార్ మెంబర్స్ ని బెదరించటం జరిగిందని గోవర్ధన్ మార్తిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ మధ్యనే అతని ఇంటిపై ఇనకంటాక్స్ దాడి జరిగితే ఆ ఆఫీసర్స్ ని బెదిరించినట్లు కంప్లైంట్ నమోదు అయింది.

    గోవర్ధన్ మూర్తి గతంలో ఆంధ్రా క్యాబినేట్ మినిస్టర్ ని కూడా చీట్ చేసాడు . ఓ క్యాబినెట్ మినిస్టర్ చేత దాదాపు నలభై కోట్ల రూపాయలు బెంగుళూరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టించాడు. మూడు నెలల్లోనే రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పి డబ్బుని నొక్కేసాడు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేయటం జరిగింది.

    English summary
    The Sessions court on Wednesday acquitted realtor Govardhan Murthy and six others in a four year old murder case. The Sampigehalli police had arrested Murthy in October, 2008 from his Kerala hideout. A realtor and land developer, Govardhan Murthy had fled city after Vinod Kumar, a budding actor, was shot dead inside his farmhouse in Bagalur. The defense advocate said that evidences produced by police and public prosecutor were weak. "They said Vinod made dying declaration in a hospital around two am. We made it clear to the court that Vinod had already lost more than two liters of blood and no one in that position would make any statement," argued the defense advocate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X