»   » కుట్రకోణం: జూ ఎన్టీఆర్‌పై పగబట్టింది ఎవరు??

కుట్రకోణం: జూ ఎన్టీఆర్‌పై పగబట్టింది ఎవరు??

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Jr Ntr
  హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు జూ ఎన్టీఆర్ నివాసంలోకి ఓ అగంతకుడు తుపాకీతో చొరబడే ప్రయత్నం చేయడం, సెక్యూరిటీ అలర్ట్ కావడంతో పారిపోయిన సంఘటన తెలిసిందే. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37 చోటు చేసుకున్న ఈ సంఘటన ఆయన అభిమానులతో పాటు అందరినీ షాక్‌కు గురి చేసింది.

  ఇది సాధారణ దొంగతనం ప్రయత్నం అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేని సంఘటన. అంగతకుడు తుపాకి చేత పట్టుకుని రావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఆదివారం అందరూ దీపావళి పండగ మూడ్లో ఉన్న నేపథ్యంలో, సెక్యూరిటీ కూడా లూజ్ గా ఉంటుందనే భావనతోనే అగంతకుడు ప్లాన్ ప్రకారం జూ ఎన్టీఆర్ ఇంట్లోకి ప్రవేశించినట్లు స్పష్టం అవుతోంది.

  సదరు అగంతుకడు చేతిలో తుపాకి పట్టుకుని ఎందుకొచ్చాడు? ఎవరిని టార్గెట్ చేద్దామని? జూ ఎన్టీఆర్‌కు ఏమైనా హాని చేయాలనే ప్రయత్నమా? లేక మరేమైనా ఉద్దేశ్యమా? ఇలా అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటన వెనక ఎవరి ప్రమేయమైనా ఉందా?....ఇలా అంతుచిక్కని సందేహాలెన్నో...

  ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నాడు. మరో వైపు ఆయనకు బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తోంది. అదే సమయంలో ఆయన రాజకీయాల్లోకి రాకుండా బలమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ప్రచారం ఉంది.

  తాజాగా వెలుగు చూసిన సంఘటనలో కుట్ర కోణం స్పష్టం కనిపిస్తుందనేది అభిమానుల అభిప్రాయం. పారిపోయిన అగంతకుడిని పట్టుకుని ఈ సంఘట వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాలు, నిజా నిజాలు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.

  English summary
  In a serious lapse of security, an unidentified man tried to jump the compound wall of Junior NTR. Alarmingly, he is also carrying a gun with him. But luckily, the security was alerted with the noise made by him but he fled from there before they catch him. The person reportedly arrived in a Number plate less vehicle and none of the security managed to identify him.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more