Don't Miss!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
‘మూర్ఖుడు’...బాబాగా చంద్రమోహన్
హైదరాబాద్: సీనియర్ నటుడు చంద్రమోహన్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన నటిస్తున్న ఆ చిత్రం పేరు ‘మూర్ఖుడు'. సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై సత్యం ముప్పిడి దర్శకత్వంలో డా.సి.వి.రత్నకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తిచేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సత్యం ముప్పిడి మాట్లాడుతూ ‘చంద్రమోహన్, ధన్రాజ్లపై చిత్రీకరించిన క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రానికి హైలెట్‌గా ఉంటాయి. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఆటోబయోగ్రఫీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చంద్రమోహన్ బాబాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.
ఈ చిత్రంలో చంద్రమోహన్ పాత్ర ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని, బాబాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారని, చంద్రమోహన్, ధన్‌రాజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుతున్నామని నిర్మాత డా.సి.వి.రత్నకుమార్ తెలిపారు.
50 సంవత్సరాల తన సినీ కెరీర్లో తొలిసారిగా బాబాగా నటిస్తున్న ఈ చిత్రం అందర్నీ ఆలోచింపచేస్తుందని నటుడు చంద్రమోహన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: డా.సి.వి.రత్నకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యం ముప్పిడి.