twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మూర్ఖుడు’...బాబాగా చంద్రమోహన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సీనియర్ నటుడు చంద్రమోహన్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన నటిస్తున్న ఆ చిత్రం పేరు ‘మూర్ఖుడు'. సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై సత్యం ముప్పిడి దర్శకత్వంలో డా.సి.వి.రత్నకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తిచేశారు.

    ఈ సందర్భంగా దర్శకుడు సత్యం ముప్పిడి మాట్లాడుతూ ‘చంద్రమోహన్, ధన్‌రాజ్‌లపై చిత్రీకరించిన క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రానికి హైలెట్‌గా ఉంటాయి. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఆటోబయోగ్రఫీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చంద్రమోహన్ బాబాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.

    Murkhudu: Chandramohan Turns Baba

    ఈ చిత్రంలో చంద్రమోహన్ పాత్ర ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని, బాబాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారని, చంద్రమోహన్, ధన్‌రాజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుతున్నామని నిర్మాత డా.సి.వి.రత్నకుమార్ తెలిపారు.

    50 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో తొలిసారిగా బాబాగా నటిస్తున్న ఈ చిత్రం అందర్నీ ఆలోచింపచేస్తుందని నటుడు చంద్రమోహన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: డా.సి.వి.రత్నకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యం ముప్పిడి.

    English summary
    For the first-time in his long acting career, senior actor Chandra Mohan donned the role of a God man or Baba. Chandra Mohan is essaying this Baba role in upcoming Telugu film 'Murkhudu'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X