twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మురుగదాస్ కొత్త చిత్రం 'జర్నీ' డిటేల్స్

    By Srikanya
    |

    గజనీ చిత్రంతో తానేంటో నిరూపించుకున్న దర్సకుడు మురదాస్ తాజా చిత్రం 'జర్నీ' . అయితే ఈ చిత్రానికి దర్శకుడు కాదు మురగదాస్..ఆయన నిర్మాత మాత్రమే. మురుగదాస్ నిర్మాతగా హాలీవుడ్ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలిసి నిర్మించిన 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి తెలుగులోకి అనువదిస్తున్న సంగతి విదితమే. శర్వానంద్, జై ,అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి 'జర్నీ' అనే పేరు నిర్ణయించినట్లు సురేష్ కొండేటి తెలిపారు. ఈ సందర్భంగా మురుగదాస్ మాట్లాడుతూ 'తమిళంలో నేను నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా విజయవంతం చేస్తారనే నమ్మకం ఉంది. కథకు తగ్గట్లుగా తెలుగులో 'జర్నీ' అనే పేరు నిర్ణయించాం' అన్నారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ 'గజని, స్టాలిన్ వంటి పవర్‌ఫుల్ చిత్రాలను రూపొందించిన మురుగదాస్ నిర్మించిన తొలి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.

    తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. 'గమ్యం', 'ప్రస్థానం' సినిమాల తరువాత మళ్లీ అతనికి అంత పేరు తెచ్చే సినిమా ఇది. రెండు జంటలమధ్య సాగే రెండు ప్రేమకథలతో ఈ సినిమా ఉంటుంది. విడివిడిగా సాగే ఈ కథలకు క్లైమాక్స్ సీన్స్ లో లింక్ ఉంటుంది. ఈ వారంలోడబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో పాటలు కూడా బాగా వచ్చాయి' అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సిహెచ్.ప్రద్యుమ్న, సంగీతం: సత్య, ఫొటోగ్రఫీ: వేల్‌రాజ్, సమర్పణ: 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి., నిర్మాత: సురేష్ కొండేటి, దర్శకత్వం: శరవణన్. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా 'సెవెన్త్‌సెన్స్" చిత్రం రూపొంది విడుదలకు రెడీ అవుతోంది.

    English summary
    Murugadoss said, “The Tamil audience made this movie a grand success. Hence we are confident that this movie will also become a big hit in Telugu. We have chosen the aptly suitable title ‘Journey’ for the Telugu version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X