అప్పట్లో అలా చేశారు.. అదో అనుభవంగా మిగిలింది.. నయనతార షాకింగ్ కామెంట్స్.. డైరెక్టర్ రియాక్షన్

సౌత్ ఇండియన్ తెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ భారీ పారితోషికం అందుకుంటున్న నయనతార ఓ సినిమా విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో నటించిన ఓ సినిమాలో చేసిన పాత్రపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. దీనిపై ఆ సినిమా డైరెక్టర్ స్పందించాడు. ఇంతకీ నయనతార చేసిన కామెంట్స్ ఏంటి? ఆ డైరెక్టర్ ఎవరు? వివరాల్లోకి పోతే..

కెరీర్ ఆరంభంలో నయన్..

కెరీర్ ఆరంభంలో నయన్..

ప్రస్తుతం విలక్షణ కథాంశాలు ఎంచుకుంటూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న నయనతార.. తన కెరీర్ మొదట్లో ఇషమొచ్చినట్లుగా సినిమాల్ని ఒప్పుకునేదట. కథ గురించి గానీ, తన పాత్ర గురించి గానీ ఎక్కువగా ఆలోచించకపోయేదట. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కెరీర్ ఆరంభంలో ఆఫర్ ఇలా చేయక తప్పదు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు చాలామంది ఇలా చిన్న చిన్న పాత్రలు అంతగా ప్రాధాన్యం లేని హీరోయిన్‌ రోల్స్ చేసివారే.

గతంలో చేసిన పొరపాట్లు

గతంలో చేసిన పొరపాట్లు

అయితే హీరోయిన్‌గా పాపులారిటీ ఒకానొక దశకు వచ్చాక ఆరంభంలో అలాంటి పాత్రలు ఎందుకు చేశామా అని బాధపడుతుంటారు. ప్రస్తుతం నయన్ కూడా అలాగే ఫీల్ అవుతోందట. ఈ మేరకు గతంలో తను పాత్రల ఎంపికలో చేసిన పొరపాట్ల విషయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది నయన్.

చెప్పిందొకటి.. చేసిందొకటి.. అదో అనుభవం

చెప్పిందొకటి.. చేసిందొకటి.. అదో అనుభవం

స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌, టాప్‌ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా 'గజిని'లో నటించటం తన కెరీర్‌లో తీసుకున్న అతి చెత్త నిర్ణయం అనేసి షాకిచ్చింది నయనతార. ''కథ, నరేషన్‌ సమయంలో చెప్పిన విధంగా తెరపై నా పాత్రను తీర్చిదిద్దలేదు. నా లుక్ కూడా అందులో బాగా లేదు. ఈ విషయంలో నేను ఎవరిపై కంప్లైంట్ చేయడం లేదు.. ఇది నాకు అనుభవం నేర్పింది'' అని నయన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

గజినీ డైరెక్టర్‌ రియాక్షన్

గజినీ డైరెక్టర్‌ రియాక్షన్


తాజాగా ఈ విషయంపై గజినీ డైరెక్టర్‌ మురుగదాస్ స్పందించాడు. తాను ఉద్దేశ పూర్వంగా ఓ ఆర్టిస్ట్‌ను తక్కువ చేయటం, మరో ఆర్టిస్ట్‌కు ఎక్కువ పాత్ర ఇవ్వటం లాంటివి చేయనని చెప్పాడు. కథ డిమాండ్‌, స్టోరీ లైన్ మేరకు మాత్రమే మార్పులు చేర్పులు ఉంటాయని అన్నాడు. 'గజినీ' విషయంలో కూడా అదే జరిగిందంటూ క్లారిటీ ఇచ్చాడు మురుగదాస్.

మళ్ళీ ఇన్నేళ్లకు అదే మురుగదాస్‌తో..

మళ్ళీ ఇన్నేళ్లకు అదే మురుగదాస్‌తో..

గజినీ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు అదే మురుగదాస్ దర్శకత్వంలో నటించింది నయనతార. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'దర్బార్‌' మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X