twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ ‘తుపాకి’ వివాదం-ఫిల్మ్ ఛాంబర్‌పై ఫైర్

    By Bojja Kumar
    |

    ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, కాజల్ జటంగా తమిళంలో నిర్మిస్తున్న 'మాళైవీరతు మళియతుల్లి" చిత్రాన్ని తెలుగులో 'తుపాకి" పేరుతో విడుదల చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే 'తుపాకి" టైటిల్ విషయంలో వివాదం చెలరేగింది. ఈ టైటిల్ తమదే అంటూ మరో దర్శకనిర్మాత ఆందోళన ప్రారంభించారు.

    అతని పేరు జింకా హరిబాబు. అరుణోదయ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హరిబాబు 'తుపాకి" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో ప్రారంభంకానున్న ఈ చిత్రం గురించి జింక హరిబాబు మాట్లాడుతూ...'తుపాకి" పేరుతో ఫిల్మ్ ఛాంబర్‌లో మేము టైటిల్ రిజిష్టర్ చేసుకున్నామని, తుపాకి టైటిల్ మేము ఎవరికీ ఇవ్వలేదని. ఈ టైటిల్ కొరకు మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదని మీడియాతో అన్నారు.

    తాను తీయబోయే 'తుపాకి" చిత్రం ఉగ్రవాద నేపథ్యంలో వుంటుందని, కథ, పాటలు కూడా తయారయ్యాయి, కొంతమంది నటీనటులను కూడా ఎంచుకున్నాం. ఈ టైటిల్‌కు ఛాంబర్ వారు ఎలా అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదు" అని అన్నారు. తన టైటిల్ తనకు రాని ఫక్షంలో న్యాయ పోరాటానికి సిద్దమని జింక హరి బాబు తేల్చి చెప్పారు.

    English summary
    Director Murugadoss’s forth coming film is getting ready to hit the floors. Tamil star hero Vijay is the leading star of the film. Kajal Agarwal is roped to romance Vijay. Latest news is this film is titled as ‘Thupaki’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X