»   » మస్కట్‌లో మంచి కార్యక్రమం ప్లాన్ చేసిన మెగా ఫ్యాన్స్

మస్కట్‌లో మంచి కార్యక్రమం ప్లాన్ చేసిన మెగా ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాలు, పోరుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేయడం చూస్తేనే ఉన్నాం. కానీ విదేశాల్లో నివాసం ఉంటున్న మెగా అభిమానులు కూడా తమ కర్తవ్యాన్ని, అభిమానాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. మస్కట్ లో ఉంటున్న మెగా అభిమానులు ఒక మంచి కార్యక్రమం చేపట్టబోతున్నారు.

రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 25న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించబోతున్నారు. మస్కట్లో ఉంటున్న మెగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరైన రక్తదానం చేయబోతున్నారు. అదే విధంగా మార్చి 27న గ్రాండ్ గా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించబోతున్నారు.

మార్చి 25వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఘాల లోని భోస్కర్ బ్లడ్ బ్యాంక్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు సేవాకార్యక్రమాలతో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Muscat Mega Fans conducting Mega Blood Donation Camp

రామ్ చరణ్ మూవీ డీటేల్స్..
సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో రామ్ చరణ్ తర్వాతి చిత్రం తెరకెక్కుతోంది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పదో చిత్రం ఇది. ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవలే గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగింది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కింస్తున్నారు.

అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో భారీ అంచనాల నడుమ నిర్మించబోతున్న ఈ సినిమాను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందించబోతున్నారు. ఫిబ్రవరి 22నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో కనిపించబోతున్నారు. నాజర్, పోసాని కృష్ణ మురళి కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. సాంకేతిక నిపుణులు... సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్, ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

English summary
Muscat Mega Fans are conducting Mega Blood Donation Camp on this ‪#‎March25th‬ (Friday) on the occasion of ‎Mega PowerStar‬ Ram Charan's Birthday at Bhoskar Blood Bank - Ghala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu