»   » క్యాన్సర్‌తో కన్నుమూసిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

క్యాన్సర్‌తో కన్నుమూసిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు ఆదేశ్ శ్రీవాత్సవ(51) క్యాన్సర్ తో కన్నుమూసారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అందేరిలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి దాటిని తర్వాత 12.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. 2011 నుండి ఆదేశ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. అయితే గత 40 రోజులు నుండి వ్యాధి తీవ్రత ఎక్కువైంది.

Music composer Aadesh Shrivastava dies of cancer at 51

కెరీర్లో ఆదేశ్ శ్రీవాత్సవ దాదాపు 70కి పైగా చిత్రాలకు చిత్రాలకు సంగీతం అందించారు. ఛల్తే ఛల్తే, బాగ్‌బన్, కబీ ఖుషీ కబీ గమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. తాజాగా విడుదలైన వెల్ కం బ్యాక్ ఆయన సంగీతం అందించిన చివరి సినిమా. కొన్ని చిత్రాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

గాయకుడిగానూ సినీ రంగానికి తన సేవలు అందించారు. మాజీ నటి విజేత పండింత్ ను వివాహమాడిన ఆయనకు అనివేష్, వితేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆదేశ్ ఆసుపత్రిలో ఉండగా పలువురు సినీ ప్రముఖులు వచ్చి పరామర్శించి వెళ్లారు. ఆయన మరణంతో బాలీవుడ్ సంగీత ప్రపంచం విషాదంలో మునిగి పోయింది.

English summary
Music composer Aadesh Shrivastava (51), who was battling a cancer relapse, passed away at Kokilaben Hospital on Saturday at around 12.30am.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu