పోటుగాడు మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు వివాహం (ఫోటోస్)
హైదరాబాద్: పోటుగాడు చిత్రం సంగీత దర్శకుడు, మంచు మనోజ్‌కు సన్నిహితుడైన అచ్చు వివాహం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. శివప్రియ అనే అమ్మాయితో అచ్చు వివాహం జరిగింది. ఈ వేడుకకు మంచు మనోజ్, సింగర్స్ మనో, చిత్రలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రముఖులు హాజరయ్యారు.
అచ్చు తండ్రి రాజమణి ప్రముఖ సౌతిండియన్ మ్యూజిక్ డైరెక్టర్. తండ్రి నుండి సంగీత వారసత్వం స్వీకరించని అచ్చు... కీ బోర్డ్ ఫోగ్రామర్‌గా కెరీర్ మొదలు పెట్టాడు. 350కి పైగా పాటలకు పని చేసారు. దాదాపు 150 సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. 2008లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘నేను మీకు తెలుసా?' అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలకు పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. తెలుగులో వచ్చిన కుర్రాడు, ఓం 3డి, డికె బోస్, పోటుగాడు, నా రాకుమారుడు, పాండవులు పాండవులు తుమ్మెద, రారా కృష్ణయ్య, కరెంట్ తీగ, గడ్డం గ్యాంగ్ తదితర చిత్రాలకు పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో పాటు పలు తమిళ సినిమాలకు కూడా పని చేసాడు. స్లైడ్ షోలో అచ్చు వివాహానికి సంబంధించిన ఫోటోలు...

అచ్చు-శివప్రియ
వివాహ వేడుకలో నూతన వదూవరులు అచ్చు, శివప్రియ.

మనోజ్
అచ్చు, శివప్రియ వివాహ వేడుకకు హాజరైన తెలుగు హీరో మనోజ్.

స్నేహం
అచ్చు, మనోజ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది.

తమిళ సాంప్రదాయం ప్రకారం
తమిళ సాంప్రదాయం ప్రకారం అచ్చు, శివప్రియ వివాహం జరిగింది. ఈ వేడుకకు మనోజ్ కూడా పంచె కట్టులో హాజరయ్యారు.

సింగర్ చిత్ర
అచ్చు వివాహ వేడుకకు ప్రముఖ సంగిర్ చిత్ర కూడా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











