బిగ్ బ్రేకింగ్: స్టార్ హీరో కుమార్తె ఆత్మహత్య... కారణం ఏంటంటే?
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ కుమార్తె లారా విజయ్ అంటోనీ ఆత్మహత్యకు పాల్పడింది. 12వ తరగతి చదువతున్న లారా... చెన్నైలోని డిడికె రోడ్‌లోని తన ఇంట్లో తెల్లవారుజామున 3 గంటలకు ఆమె ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు లారా చనిపోవడానికి కారణం ఏంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని గురించి ప్రత్యక పరిచయం అక్కర్లేదు. తమిళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఆయన.. హీరోగానూ సినిమాలు చేశారు. తెలుగులో బిచ్చగాడు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్. ఇక ఆయన ఇంట్లో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. విజయ్ అంటోనీ కూతురు లారా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 16 ఏళ్ల వయసు ఉన్న లారా... చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతుంది. చెన్నైలోని డిడికె రోడ్‌లోని తన ఇంట్లో తెల్లవారుజామున 3 గంటలకు ఆమె ఉరివేసుకుని చనిపోయిందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

గత కొన్ని రోజులుగా లారా ఒత్తిడిలో ఉన్నారని కూడా చెబుతున్నారు. లారా మృతిపై అసలు కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. ఇక విజయ్ అంటోనీ కుమార్తె మృతి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లారా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారా మృతితో విజయ్ ఆంటోనీ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సినిమా పరిశ్రమ పెద్దలు విజయ్ ఆంటోనీ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఇక విజయ్ ఆంటోని తెలుగులో బిచ్చగాడు సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యారు. బిచ్చగాడు సినిమా ఇక్కడి వారికి బాగా కనెక్ట్ అయి ఊహించనంత రేంజ్‌లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఇటీవల ఆయన ఆయన బిచ్చగాడు 2 వచ్చారు. ఈ సినిమా కూడా తెలుగు, తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక విజయ్ అంటోనీ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు.. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాదు ఆయన ప్లైబ్యాక్ సింగర్ కూడా. ఫిల్మ్ ఎడిటర్, ఆడియో ఇంజినీర్, ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్టు వంటి వీటన్నిటిలో ఆయనకు ప్రావిణ్యం ఉంది. ఒక్క నటుడిగా పరిమితం అవ్వకుండా అన్నింట్లో విజయ్ అంటోనీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన హత్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

సినిమాల విషయాలు పక్కన పెడితే.. విజయ్ ఆంటోనీ కుమార్తె చనిపోవడం కలవరం రేపుతోంది. 16 ఏళ్ల వయసు ఉన్న బాలిక.. అసలు ఏ కారణాల చేత చనిపోయిందోనని అంతా అనుకుంటున్నారు. చదువులో ఒత్తిడి కారణంగానా... ఇంట్లో ఏమైనా ఒత్తిడా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విజయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











