యాంకర్ సుమను సన్నీలియోన్‌తో పోల్చిన మ్యూజిక్ డైరెక్టర్ ..నేహా శెట్టిని లాగుతూ హాట్ కామెంట్స్!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన చిత్రాలతో సత్తా చాటుతోన్నారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి వారిలో రాయలసీమ కుర్రాడు కిరణ్ అబ్బవరం ఒకడు. కొంత కాలంగా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అతడు.. ఇప్పుడు 'రూల్స్ రంజన్' అనే సినిమాతో రాబోతున్నాడు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ అమ్రిష్.. యాంకర్ సుమ, నేహా శెట్టిపై హాట్ కామెంట్స్ చేశాడు. అసలేమైందో మీరే చూసేయండి మరి!

రూల్స్ రంజన్‌గా కిరణ్ రెడీ: కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ తెరకెక్కించిన సినిమానే 'రూల్స్ రంజన్'. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను స్ట్రైట్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో దివ్యాంగ్, వేమూరి మురళీ కృష్ణ నిర్మించారు. ఇందులో మెహర్ చహల్, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, సుబ్బరాజు, వైవా హర్ష వంటి వాళ్లు నటించారు.
గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్: ఫన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'రూల్స్ రంజన్' మూవీని అక్టోబర్ 6వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం రాత్రి హైదరాబాద్‌లో కలర్‌ఫుల్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది. దీనికి చాలా మంది అభిమానులు వచ్చి ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్ చేసేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ స్పీచ్ కేక: ఎంతో గ్రాండ్‌గా జరిగిన 'రూల్స్ రంజన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అమ్రిష్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. పేరుకు తమిళ వ్యక్తే అయినా తెలుగులోనూ చక్కగా మాట్లాడాడు. ముఖ్యంగా తనపై తాను పంచులు వేసుకుని అందరినీ నవ్వించాడు. అలాగే, ఈ అవకాశాన్ని ఇచ్చి నిర్మాతలకు, దర్శకుడికి, హీరోకు పలుమార్లు అమ్రిష్ ధన్యవాదాలు తెలిపాడు.

సన్నీ లియోన్‌తో సుమను: ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అమ్రిష్ మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ముందుగా నేను సుమ మేడంకు పెద్ద అభిమానిని. నేను చెన్నైలో ఉన్నా మీకు నిజంగానే ఫ్యాన్స్‌ను. మా లాంటి యంగ్‌స్టర్స్‌కు సన్నీ లియోన్ వీడియో పెడితే వెంటనే వెళ్లి చూస్తాం కదా. అలా సుమ గారు ఉన్నారని ఆమె చేసే ఇంటర్వ్యూలు చూసే ఫ్యాన్స్‌ను నేను. మీరు ఉండడం వల్ల ఈ ఫంక్షన్ మరింత జోష్‌తో సాగుతోంది' అంటూ షాకిచ్చాడు.

ఒక అమ్మాయి అడిగింది: ఆ తర్వాత అమ్రిష్ కంటిన్యూ చేస్తూ.. 'నేను చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఏఎంబీ మాల్‌లో సమోసా తిందామని వెళ్లాను. సమ్మోహనుడా వంటి సాంగ్ చేసినా నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. పైగా నా జుట్టు చూసి వింతగా చూస్తున్నారు. ఇదేంట్రా అనుకుంటుంటే ఒక అమ్మాయి వచ్చి నన్ను గుర్తు పట్టి మాట్లాడింది. అందుకే నా హెయిర్ ఇలానే ఉంచాను' అని నవ్వించాడు.

ఆది, వెన్నెల కిశోర్ ఫన్: అనంతరం అమ్రిష్ చిత్రంలో నటించిన, పని చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఆ సమయంలోనే 'హైపర్ ఆది సార్.. మీ కామెడీ టైమింగ్ చూసి నేను ఆర్ఆర్ చేయలేకపోయాను. అందుకే కాస్త లేట్ అయింది. వెన్నెల కిశోర్ సార్ కూడా అంతే. మీ కాంబినేషన్ అదిరిపోయింది. హీరో గారు కూడా భలే టైమింగ్‌తో కనిపించి.. ఫన్‌ను క్రియేట్ చేశారు' అంటూ కొనియాడాడు.

హ్యాండ్ వాష్ చేసుకోను: ఆ తర్వాత అమ్రిష్ కంటిన్యూ చేస్తూ.. 'నేను హీరోయిన్ గారికి కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఆమెను టచ్ చేసిన ఈ హ్యాండ్‌ను ఈరోజు నుంచి వాష్ చేసుకోను. ఆమెతో ఒక్కసారైనా సమ్మోహనుడా పాటకు డ్యాన్స్ చేయాలి అనుకున్నా. అది ఈరోజు కుదిరింది. మరి నేను డ్యాన్స్ చేశానో లేదో నాకే తెలీదు. ఏదో అలా అలా ఊపేశాను' అంటూ ఓ రేంజ్‌లో కామెడీ చేశాడు. ఆ తర్వాత సమర్పకులు ఏఎమ్ రత్నం, డైరెక్టర్, నిర్మాతలకు అమ్రిష్ స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాడు. మొత్తానికి సుమ, నేహా శెట్టిపై అతడు చేసిన హాట్ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











