Bappi Lahiri తెలుగులో కూడా మర్చిపోలేని హిట్స్.. మెగాస్టార్ తో బిగ్గెస్ట్ హిట్.. ఆ ఒక్క సినిమాతోనే..

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతగానో గుర్తింపు అందుకున్న సంగీత దర్శకులలో బప్పీ లహరి ఒకరు. ఇటీవల లతా మంగేష్కర్ కన్నుమూసిన కొన్ని రోజులకే బప్పీ లహరి కూడా కన్నుమూయడం అందరిని శోక సంద్రంలో ముంచేసింది. బప్పీ లహరి అంటే కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాదు తెలుగులో కూడా పలు సినిమాలకు మంచి మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమకు మ్యూజిక్ అందించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక తెలుగులో ఎన్ని సినిమాలు చేశారు అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bappi Lahiri The Disco King | India Remembers The Music Legend | Oneindia Telugu
ఆ కారణంగా మృతి..

ఆ కారణంగా మృతి..

గత కొంతకాలంగా ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడిన బప్పీ లహరి 29 రోజుల పాటు జుహులోని క్రిటికేర్ హాస్పిటల్‌లో ఆసుపత్రిలో ఉన్నాడు. ఆయన బాగానే కోలుకుంటున్నారు అని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఫిబ్రవరి 15 న డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, ఒక రోజు తర్వాత ఇంట్లోనే అతని ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. తీవ్రమైన స్థితిలో ఉండగా క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. ఇక బప్పీ లహరి రాత్రి 11.45 గంటలకు అనారోగ్యంతో మరణించాడు. గత సంవత్సరం కోవిడ్ ఇన్ఫెక్షన్‌ కు కూడా గురైన బప్పీ లహరి తొందరగానే కొలుకున్నారు.

డిస్కో కింగ్

డిస్కో కింగ్

బప్పీ లహరి అసలు పేరు అలోకేష్ లహరి. అతన్ని అందరూ బప్పి అని ముద్దుగా పిలుస్తారు. ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ తో క్రేజ్ అందుకున్న ఆయన. 80, 90 లలో బాలీవుడ్ 'డిస్కో కింగ్'గా క్రేజ్ అందుకున్నారు. ప్రత్యేకించి నమక్ హలాల్, డిస్కో డ్యాన్సర్ , డ్యాన్స్ డ్యాన్స్ వంటి హిట్స్ తో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు. ఎలాంటి పాటకు ట్యూన్ కట్టినా కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది.

అదే ఆఖరి పాట

అదే ఆఖరి పాట

హిమ్మత్ వాలా, షరాబి, అడ్వెంచర్స్ ఆఫ్ టార్జాన్, సత్యమేవ్ జయతే, కమాండో, ఆజ్ కే షాహెన్‌షా వంటి ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు. గతంలో బప్పీ లాహిరి ది డర్టీ పిక్చర్ కోసం ఊ లా లా అనే పాటతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అతను చివరిగా 2020లో బాఘీ 3 కోసం భంకస్ పాటను కంపోజ్ చేశాడు. ఇక అప్పుడే కాస్త హడావుడిగా కనిపించిన బప్పీ లహరి ఆరోగ్యం క్షిణించడంతో సినిమాలకు దూరంగానే ఉన్నారు.

 తెలుగులో 24 సినిమాలు

తెలుగులో 24 సినిమాలు

బప్పీ లహరి కేవలం హిందీలోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం గుజరాతీ భాషల్లో కూడా పలు సినిమాలకు సంగీతం అందించాడు. ముఖ్యంగా తెలుగులో కూడా బప్పీ ఎవర్ గ్రీన్ హిట్స్ అందించారు. తెలుగులో మొత్తంగా 24 సినిమాలకు మ్యూజిక్ అందించారు. 1986లో సూపర్ స్టార్ కృష్ణ బప్పీ లహరిని తెలుగులో పరిచయం చేశారు. అలా క్లిక్కవడంతో పలు క్లాసిక్ సినిమాలకు మంచి మ్యూజిక్ అంధించారు. తేనె మనసులు, త్రినేత్రుడు, స్టేట్ రౌడీ వంటి సినిమాలకు గ్యాప్ లేకుండా మ్యూజిక్ అందించారు.

 గ్యాంగ్ లీడర్ తో బిగ్ హిట్

గ్యాంగ్ లీడర్ తో బిగ్ హిట్

ఇక తెలుగు ఆడియేన ఎన్నటికీ మరచిపోలేని బెస్ట్ మ్యూజికల్ హిట్స్ లలో గ్యాంగ్ లీడర్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఆ యాక్షన్ ఫిల్మ్ లో బప్పీ లహరి అందించిన అన్ని పాటలు కూడా హిట్టయ్యాయి. పాప రీటా, అలాగే వాన వాన వెల్లువయే పాట కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రొటీన్ పాటల నుంచి కొత్త రిథమ్స్ తో వచ్చిన ఆ పాటలు ఆడియేన్స్ ను ఉర్రుతలుగించాయి.

ఆ తరువాత తెలుగులో బిజీగా..

ఆ తరువాత తెలుగులో బిజీగా..

గ్యాంగ్ లీడర్ సినిమా అనంతరం బప్పీ లహరికి తెలుగులో ఇంకా ఎక్కువ అవకశాలు వచ్చాయి. బిజీగా ఉండడం వలన ఆయన కొన్నిటిని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. రౌడి ఇన్స్పెక్టర్, నిప్పు రవ్వ, బిగ్ బాస్, ఇలా వరుసగా తెలుగులో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. చివరగా 1996లో తెలుగులో పుణ్య భూమి నా దేశం సినిమాకు మ్యూజిక్ అందించిన బప్పీ అనంతరం మళ్ళీ 2013లో అల్లరి నరేష్ యాక్షన్ 3Dకి తన కొడుకుతో కలిసి వర్క్ చేశారు. 2020లో ఆఖరిసరిగా తెలుగులో రవితేజ డిస్కో రాజా సినిమాలో రమ్ పమ్ బమ్ అనే పాట పాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X