»   »  సంగీత ‘చక్రవర్తి’ ఆస్తి కోసం గొడవ, పోలీస్ కేసు...

సంగీత ‘చక్రవర్తి’ ఆస్తి కోసం గొడవ, పోలీస్ కేసు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుల్లో చక్రవర్తి ఒకరు. ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ తరలినపుడు సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఆయనకు బంజారాహిల్స్ లోని రోడ్ నెం.2లో సినీమాక్స్ వెనకాల 2420 గజాల స్థలం కేటాయించింది.

రికార్డింగ్ థియేటర్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఆ స్థలం కేటాయించింది. అయితే అక్కడ ఇప్పటికీ ఎలాంటి నిర్మాణం జరుగలేదు. ఇపుడు ఆ స్థలం విషయంలో కుటుంబంలో పెద్ద గొడ జరుగుతోంది. ఆయన ఇద్దరు కోడళ్లు ఈ విషయమై పోలీస్ స్టేషన్ కు ఎక్కారు. ఆ తప్పుడు పత్రాలతో తోడికోడలు అరుణ కాజేసేందుకు యత్నిస్తున్నదని ఆయన రెండోకోడలు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

 Music director Chakravarthy's land dispute

ఈ స్థలం విషయంలో ఎప్పటి నుండో వివాదం ఉంది. ఆ వివాదాల కారణంగానే చక్రవర్తి అక్కడ రికార్డింగ్ థియేటర్ నిర్మించలేదు. చక్రవర్తి అనారోగ్యంతో 2002లోనే మరణఇంచారు. గతంలోనే చక్రవర్తి చిన్నకొడుకు కేఆర్‌కే ప్రసాద్, ఇటీవలే పెద్దకొడుకు శ్రీనివాస్ చక్రవర్తి కూడా మృతిచెందారు.

ఇపుడు ఆ స్థలం విషయంలో తోడికోడళ్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తోడికోడలు అరుణ, ఆమెకొడుకు రాజేశ్‌చక్రవర్తి తప్పుడుపత్రాలతో స్థలాన్ని తమపేరిట మార్చుకొంటున్నారని, చిన్నకోడలు నీరజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

English summary
Music director Chakravarthy's land dispute details.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu