పూరీ 'గోలీమార్'..కాపీ మార్ అంటూ టీవీ నైన్ లో
ఆ నవ్వు లోనే ఏదో మాయ ఉంది...తన కళ్ళల్లోనే ఏదో మాయ ఉంది...పాట గోపీచంద్..లేటేస్ట్ చిత్రం గోలీమార్ పాట కాపీ ట్యాన్ అంటూ టీవీ నైన్ ఛానెల్ వారు ఓ పోగ్రాం చేసారు. ఇప్పుడది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కాపీ మార్ అనే టైటిల్ తో వచ్చిన ఈ పోగ్రామ్ లో చక్రి సంగీతం అందించిన ఈ పాట హాలీవుడ్ చిత్రం డెస్పరోడో లో సాంగ్ అని తేల్చారు. కొత్త ట్యూన్స్ కట్టలేక, పోటీ తట్టుకోవటం కోసమే ఇలా చక్రి చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు. అలాగే మహేష్ పోకిరిలోని సూపర్ హిట్ దేవ దేవ..దేవ పాటని రికీ మార్టిన్ పాట జలావో అంటూ ఆ పాటలను ప్రసారం చేసారు. ఇక ప్రవరాఖ్యుడు చిత్రంలోని పాటని జస్టిన్ టింబర్ లేక్ లోని సెక్సీ బాట్...కీరవాణి కాపీ కొట్టారంటూ...మంత్ర, మహా మహా లోని పాటని సైతం కాపీ కొట్టారని చెప్పుకొచ్చారు. అలాగే ఇడియట్ లో సూపర్ డూపర్ హిట్ సాంగ్...చూపులతో..గుచ్చి గుచ్చి చంపకే పాట సైతం కొద్దీగా కూడా మార్చకుండా మికా సింగ్ సాంగ్ పాపులర్ పాప్ సాంగ్ నుంచి కాపీ కొట్టారని తేల్చారు. ఈ పాటల మూలాల గురించి తెలియటం ఆనందం అనిపించినా తమకు నచ్చిన ఆ సాంగ్స్ కాపీ అనే తేలటం భాధాకరం అంటున్నారు.


Click it and Unblock the Notifications











